ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్' (Elon Musk) ఏది చేసిన ఓ సంచలనమే. ట్విటర్ కొనుగోలు చేసి అందులో ఊహకందని మార్పులు చేశారు. ఆఖరికి పేరు, లోగో అన్నీ మార్చేసి 'ఎక్స్' అని నామకరణం చేశారు. ఇప్పుడు 'ఎక్స్ టీవీ'గా కూడా పరిచయం చేశారు.
ఎక్స్ టీవీ అనేది ఒక యాప్. చాలాకాలంగా మస్క్ కలలు కంటున్న ఈ ఎక్స్ స్మార్ట్ టీవీ యాప్ మొత్తానికి వచ్చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాప్‌లో సినిమాలు, లైవ్ వంటి వాటిని కూడా చూడవచ్చు. ఇది గూగుల్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ఎక్స్ టీవీ యాప్ అనేది కేవలం ఆండ్రాయిడ్ టీవీలైన ఎల్‌జీ, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ టీవీ వంటి వాటిలో మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని గూగుల్ ప్లే స్టార్, ఎల్‌జీ స్టోర్ లేదా అమెజాన్ స్టోర్స్ నుంచో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఎలా పని చేస్తుంది? దీనిని యూజర్లు ఇష్టపడతారా? లేదా అనే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తదుపరి పరిణామాలు జరుగుతాయి.
ఇప్పటికే ఎక్స్ టీవీ యాప్‌లో పలువురు వినియోగిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దీనిని కొంతమంది వినియోగదారులకు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోగలరు. రాబోయే రోజుల్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉండనుంది.
ఎక్స్ టీవీ యాప్‌లో లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ట్రెండింగ్ వీడియో అల్గారిథమ్, వీడియో సెర్చింగ్ వంటి వాటితో పాటు.. రీప్లే టీవీ (72 గంటల వరకు షోను స్టార్ చేసుకోవచ్చు), స్టార్ట్‌ఓవర్ టీవీ (లైవ్ షో స్టార్టింగ్ నుంచి ప్రారంభించడానికి అనుమతిస్తుంది), ఫ్రీ క్లౌడ్ డీవీఆర్ (100 గంటలు కంటెంట్‌ను రికార్డ్ చేయవచ్చు) వంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
Beta version of 𝕏 TV is out https://t.co/taODqsMECS
— Elon Musk (@elonmusk) September 3, 2024
Comments
Please login to add a commentAdd a comment