టీవీ చూసేవారికి నో హ్యాపీ...
పరిపరి శోధన
విజ్ఞానం కంటే వినోదం కోసమే చాలామంది టీవీ చూస్తుంటారు. కాలక్షేపం కోసం, సమస్యలను తాత్కాలికంగానైనా మరచిపోవడం కోసం గంటల తరబడి టీవీకి అతుక్కుపోతుంటారు. ఇలాంటి శాల్తీలకు జీవితంలో ఏమాత్రం సంతోషం ఉండదట. మరోలా చెప్పాలంటే, నిజానికి జీవితంలో సంతోషం కోల్పోయిన వారే రోజూ గంటల తరబడి టీవీ చూస్తూ గడిపేస్తారని స్టీవెన్ మార్టిన్ అనే అమెరికన్ పరిశోధకుడు బల్లగుద్ది చెబుతున్నాడు.
గడచిన మూడు దశాబ్దాలుగా టీవీ ప్రేక్షకుల తీరుతెన్నులపై విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ధారణకు వచ్చానని అతడు అంటున్నాడు. సమస్యల వలయంలో చిక్కుకున్న వారు వాటికి పరిష్కారం గురించి ఆలోచించకుండా టీవీ చూడటానికి అలవాటు పడితే, త్వరలోనే దానికి బానిసలుగా మారుతారని హెచ్చరిస్తున్నాడు.