
ఫేస్‌బుక్ వీడియోలు ఇక టీవీలో
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఇపుడు టీవీరంగాన్ని కూడా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఫేస్‌బుక్ వీడియోలను బుల్లితెరపై చూసేందుకు వీలుగా కొత్తయాప్‌ను సిద్ధం చేస్తున్నట్టు మంగళవారం కన్‌ఫాం చేసింది. ఫేస్‌బుక్ వీడియోలను టీవీ తెరపై స్ట్రీమ్ చేసుకునేందుకు వీలుగా వీడియో-సెంట్రిక్ అప్లికేషన్ను ప్రారంభిస్తున్నట్టు ధ్రువీకరించింది. న్యూస్ ఫీడ్ వీడియోలను ఆటో ప్లేయింగ్ ఆడియో వంటి మార్పులతో అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది.
ఈ కొత్త ఫీచర్ ద్వారా డిఫాల్ట్గా న్యూస్ ఫీడ్ ను డైరెక్ట్ గా టీవీ తెరపై వీక్షించేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే యూజర్ మొబైల్ లో సేవ్ చేసుకున్నవీడియోలను కూడా కావాలనుకున్నపుడు చూడొచ్చు. అంతేకాదు మీ స్మార్ట్ ఫోన్ మ్యూట్ లో ఉంటే..మ్యూట్ లో, సౌండ్ ఆప్షన్‌లో ఉండే సౌండ్ లోను ప్లే చేస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది. స్నాప్ చాట్ మాదిరిగానే, టీవీ పూర్తి స్క్రీన్ పై యూజర్లకిష్టమైన వీడియోలను చూడొచ‍్చని వెల్లడించింది. అన్ని పరీక్షలు పూర్తయ్యాయనీ...త్వరలో యాపిల్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, సాంసంగ్ స్మార్ట్ టీవీల ద్వారా ఈ యాప్ అందుబాటులోకి రానుందని తెలిపింది. అనంతరం మిగతా అన్ని డివైస్‌లకు ఈ అవకాశం కల్పించనున్నట్టు పేర్కొంది. దీంతోపాటు యూజర్ల ఆసక్తిని ఎనలైజ్ చేసి మరి మరిన్ని వీడియోలను యూజర్లకు సజెస్ట్ చేస్తుందట. అయితే యాప్ ప్రారంభంపై కచ్చితమైన సమయాన్ని నిర్దిష్టంగా పేర్కొనకపోయినప్పటికీ.. త్వరలోనే అని ప్రకటించింది.