చిన్నారి ప్రాణం తీసిన టీవీ | Girl died as tv falls | Sakshi
Sakshi News home page

చిన్నారి ప్రాణం తీసిన టీవీ

Published Tue, May 2 2017 12:26 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

Girl died as tv falls

విడపనకల్లు (ఉరవకొండ): ప్రమాదవశాత్తు టీవీ (టెలివిజన్‌) మీద పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన  మండలంలోని కరకముక్కల గ్రామంలో సోమవారం చోటు చేçసుకుంది. గ్రామానికి చెందిన తిమ్మప్ప, లక్ష్మీదేవిల కూతురు తనూజ(4) ఇంట్లో ఆడుకుంటూ, టీవీకి ఉన్న స్టాండ్‌ను పట్టుకుని ఊపడంతో.. టీవీ మీద పడింది. దీంతో చిన్నారి తలకు గాయమై స్పహ కోల్పోయింది. తల్లిదండ్రులు వెంటనే ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement