Oppo Company
-
ఒప్పో 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వచ్చేసింది.. రూ.15వేలకే మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు!
దేశంలో పండుగల సీజన్ మొదలైంది. దీంతో వినియోగదారుల సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు దిగ్గజ సంస్థలు పోటీ పడుతుంటాయి. ముఖ్యంగా ఈ సీజన్లో హెవీ మార్కెట్ కాంపిటీషన్‌ను తట్టుకొని నిలబడేందుకు ఎలక్ట్రానిక్ కంపెనీలు ప్రొడక్ట్‌లపై భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో 17శాతం షేర్‌తో ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను శాసిస్తున్న ఒప్పో అదిరిపోయే టీవీ మార్కెట్లో విడుదల చేసింది. తక్కువ ధరకే బిగ్ స్క్రీన్ టీవీ కొనాలనుకునేవారికి 'ఒప్పో' 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ బాగా ఉపయోగపడుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆ టీవీలో ఉన్న ఫీచర్స్, వాటి పనితీరు ఎలా ఉందో చూద్దాం. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ ఒప్పో గతంలో 65 అంగుళాల స్మార్ట్ టీవీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి తాజాగా 50 ఇంచెస్ స్మార్ట్ టీవీని కొనుగోలు దారులకు పరిచయం చేసింది. OPPO K9x పేరుతో ఉన్న ఈ స్మార్ట్ టీవీని చైనాలో విడుదల చేసింది. దీని ధర 1399 యువాన్ (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.16,500)గా ఉంది. లాంచ్ ఆఫర్ కింద 1299 యువాన్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 15,350) అందుబాటులోకి ఉంచింది. త్వరలో భారత్ మార్కెట్లో అందుబాటులోకి రానుంది. దేశీయ మార్కెట్లో దాని ధర ఎంత ఉంటుందనేది ఆ సంస్థ వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ టీవిని కొనాలంటే తమ అధికారిక వెబ్ సైట్‌ను విజిట్ చేయాల్సి ఉంటుందని ఒప్పో ప్రతినిధులు వెల్లడించారు. అదిరే ఫీచర్లు ► కొత్త ఒప్పో K9x 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ మనల్ని ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. ►కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన AI PQ అల్గారిథమ్ ►ఈ స్మార్ట్ టీవీ గరిష్ట బ్రైట్ నెస్ 280 నిట్లు ►ఇందులో 2GB RAM, 16GB ROM ►క్వాడ్-కోర్ MediaTek చిప్సెట్, 20W పవర్ రేటింగ్‌తో రెండు ఇంటిగ్రేటెడ్ స్పీకర్లు ► మూడు HDMI పోర్ట్‌లు, ఒక ఈథర్నెట్ పోర్ట్ ►వైర్లెస్ కనెక్షన్ కోసం డ్యూయల్-బ్యాండ్ Wi-Fiకి మద్దతు ► ఎల్ఈడీ-బ్యాక్లిట్ ప్యానెల్‌తో 50 అంగుళాల స్క్రీన్, పూర్తి 4K రిజల్యూషన్‌తో అదిరిపోయే లుక్. కళ్ళపై ఒత్తిడిని తగ్గించడానికి 10.7 బిలియన్ రంగులుతో పాటు బ్లూ-లైట్ తగ్గించే టెక్నాలజీ, ఫ్లాగ్షిప్ స్మార్ట్ టీవీ తరహాలో బాల్‌పార్క్‌లో డిస్ప్లే-స్థాయి రంగు ఖచ్చితత్వాన్ని కలిగి ఉంది. ఇది ఇమేజ్ నాణ్యతను ఫ్రేమ్-బై-ఫ్రేమ్ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. చదవండి: Mahendra Singh Dhoni: కొత్త అవతారమెత్తిన ధోని.. షాక్‌లో నెటిజన్స్! -
'ఒప్పో' ఉద్యోగులకు కరోనా.. కంపెనీ మూసివేత
ఢిల్లీ : ప్రముఖ చైనీస్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ 'ఒప్పో' ఫ్యాక్టరీలో కరోనా కలకలం సృష్టిస్తుంది. నోయిడాలోని ఒప్పో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 6మంది ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఫ్యాక్టరీకి ఎవరూ రావద్దని ఒప్పో ఇండియా కంపెనీ ప్రతినిధి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. అధికారిక సమాచారం ప్రకారం..గ్రేటర్ నోయిడాలోని ఒప్పో తయారీ సంస్థలో మొత్తం 3వేల మంది కార్మికులు ఉన్నారు. వీరిలో ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో మిగతా ఉద్యోగుల భద్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా సంస్థను మూసివేస్తున్నట్లు ఒప్పో ఇండియా ప్రతినిధి వెల్లడించారు. (కువైట్ నుంచి వచ్చిన భారతీయుల్లో కరోనా ) ప్రస్తుతం మిగతా ఉద్యోగులందరికీ స్ర్కీనింగ్ నిర్వహిస్తున్నారు. వీరి పరీక్షా ఫలితాలు వెలువడాల్సి ఉంది. దీంతో అప్పటివరకు ఉద్యోగులెవరూ ఫ్యాక్టరీకి రావద్దని, తదుపరి నోటీసులు వచ్చాకే కార్యకలాపాలు మొదలుపెట్టాలని సంస్థ యాజమాన్యం ఆదేశించింది. కేవలం కరోనా నెగిటివ్ వచ్చిన వారు మాత్రమే ఫ్యాక్టరీకి రావల్సిందిగా అధికారులు తెలిపారు. కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈనెల ప్రారంభంలో ఒప్పో ఫ్యాక్టరీలో యథావిధిగా కార్యకలాపాలు ప్రారంభించారు. దీంతో 30 శాతం మంది ఉద్యోగులతో కంపెనీని తిరిగి ప్రారంభించారు. ఢిల్లీలో 24 గంటల్లోనే 299 కరోనా కేసులు నమోదుకాగా, దేశ వ్యాప్తంగా కొత్తగా 5వేల కోవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు భారత్‌లో వెలుగుచూసిన కరోనా కేసుల సంఖ్య 96,169 కు చేరుకుంది. ( భారత్‌లో ఒకే రోజు 5,242 పాజిటివ్ కేసులు ) -
ఒప్పో 4జీ స్మార్ట్ ఫోన్
ఆర్5@రూ. 29,990 హైదరాబాద్: చైనాకు చెందిన ఒప్పో కంపెనీ 4జీ ఎనేబుల్ హ్యాండ్సెట్ ఆర్5ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ. 29,990 అని ఒప్పో కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి ఈ ఫోన్‌కు ముందస్తు బుకింగ్స్ స్వీకరిస్తామని ఒప్పొ ఇండియా సీఈఓ టామ్ లూ పేర్కొన్నారు. ఈ ఫోన్ 4.85 ఎంఎం మందం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఫోన్లో ఆక్టా-కోర్ క్వాల్కామ్ ఎంఎస్ఎం8939 ప్రాసెసర్, 5.2 అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా వంటి ఫీచర్లున్నాయని వివరించారు. ఒప్పో వీఓఓసీ మిని ర్యాపిడ్ చార్జింగ్ సిస్టమ్ ఈ ఫోన్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. అరగంట చార్జింగ్ చేస్తేనే 75 శాతం చార్జింగ్ అవుతుందని, 5 నిమిషాల చార్జింగ్ చేస్తే 2 గంటల పాటు మాట్లాడుకోవచ్చని టామ్ లూ వివరించారు.