ఒప్పో 4జీ స్మార్ట్ ఫోన్
ఆర్5@రూ. 29,990
హైదరాబాద్: చైనాకు చెందిన ఒప్పో కంపెనీ 4జీ ఎనేబుల్ హ్యాండ్‌సెట్ ఆర్5ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ. 29,990 అని ఒప్పో కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి ఈ ఫోన్‌కు ముందస్తు బుకింగ్స్ స్వీకరిస్తామని ఒప్పొ ఇండియా సీఈఓ టామ్ లూ పేర్కొన్నారు.
ఈ ఫోన్ 4.85 ఎంఎం మందం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ ఎంఎస్‌ఎం8939 ప్రాసెసర్, 5.2 అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా వంటి ఫీచర్లున్నాయని వివరించారు. ఒప్పో వీఓఓసీ మిని ర్యాపిడ్ చార్జింగ్ సిస్టమ్ ఈ ఫోన్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. అరగంట చార్జింగ్ చేస్తేనే 75 శాతం చార్జింగ్ అవుతుందని, 5 నిమిషాల చార్జింగ్ చేస్తే 2 గంటల పాటు మాట్లాడుకోవచ్చని టామ్ లూ వివరించారు.