
షావోమి గేమింగ్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ షార్క్
చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి, తన తొలి గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను నేడు లాంచ్ చేసింది. ‘షావోమి బ్లాక్ షార్క్’ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్టు షావోమి పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను, స్పెషల్ బటన్‌ను, డిటాచ్‌బుల్ గేమ్‌ప్యాడ్‌ను, ఎక్కువ బ్యాటరీను కలిగి ఉంది. దీని ధర 2,999 సీఎన్‌వై(సుమారు రూ.31,100)గా కంపెనీ పేర్కొంది. ఏప్రిల్ 20 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ప్రారంభిస్తామని తెలిపింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో మాత్రమే అందబాటులో ఉండనుంది. అంతర్జాతీయంగా ఎప్పుడు ఈ డివైజ్‌ను విక్రయానికి తీసుకొస్తోందో కంపెనీ తెలుపలేదు. జేడీ.కామ్‌లో ఈ ఫోన్ ఇప్పటికే ప్రీ-ఆర్డర్‌కు వచ్చేసింది. పోలార్ నైట్ బ్లాక్ లేదా స్కై గ్రే రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
షావోమి బ్లాక్ షార్క్ స్పెషిఫికేషన్లు...
5.99 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ విత్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
1080x2160పీ రెజుల్యూషన్
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్
20 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా సెటప్
ముందు వైపు 20 మెగాపిక్సెల్ సెన్సార్
ఆండ్రాయిడ్ ఓరియో
6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్
8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
‘ఎక్స్ టైప్ స్మార్ట్ యాంటీనా’
గేమింగ్ మోడ్‌లోకి వెళ్లడానికి ఎడమవైపు ‘షార్క్’ బటన్

Comments
Please login to add a commentAdd a comment