
షావోమి స్మార్ట్‌ఫోన్ ఎంఐ మ్యాక్స్ 3
షావోమి తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఎంఐ మ్యాక్స్ 3ను రేపు విడుదల చేయబోతుంది. ఈ డివైజ్ గురించి మార్కెట్‌లో వస్తున్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. గత కొన్ని వారాలుగా పలు రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ రూమర్లన్నింటికీ చెక్ పెడుతూ.. కంపెనీ అధికారికంగా ఓ టీజర్‌ను విడుదల చేసింది. ఎంఐ మ్యాక్స్ 3 ఎలా ఉండబోతుందో తెలుపుతూ కంపెనీ ఈ టీజర్‌ను షావోమి అధికారిక వైబో అకౌంట్ ద్వారా ట్విటర్ యూజర్లకు రివీల్ చేసింది.
ఈ వీడియోలో ఎంఐ మ్యాక్స్ 6.9 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండబోతుందని, 5500 ఎంఏహెచ్ సామర్థ్యంతో అతిపెద్ద బ్యాటరీతో ఇది రూపొందిందని పేర్కొంది. షావోమి విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైన, కింద ఉన్న బెజెల్స్, చాలా పలుచగా ఉంటాయని కంపెనీ వీడియో టీజర్ ధృవీకరించింది. అంతేకాక ఈ స్మార్ట్‌ఫోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉందని పేర్కొంది. వెనుకవైపు కెమెరాకు కింద, ఈ ఫోన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఎంఐ మ్యాక్స్ 3 స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌పై కంపెనీ అధికార ప్రతినిధి ఆసక్తికరమై ట్వీట్ చేసింది. ‘ఎంఐ ఫ్యాన్స్, సమ్‌థింగ్ బిగ్ వస్తోంది! బిగ్ స్క్రీన్, బిగ్ బ్యాటరీ’ అని ట్వీట్ చేస్తూ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించింది.
పలు రిపోర్టుల ద్వారా తెలిసిన ఈ ఫోన్ స్పెషిఫికేషన్లు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం..
- క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 636 చిప్‌సెట్
- 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
- 18:9 ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
- 12 ఎంపీ, 5 ఎంపీలతో రియర్ డ్యూయల్ కెమెరా
చైనాలో దీని ధర 1,699 సీఎన్‌వై ఉండొచ్చని అంచనా. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు 17,700 రూపాయలు.
#Xiaomi Max 3 Official first commercial pic.twitter.com/RVhMrtXqrn
— duggtech@gmail.com (@TechNavvi) July 17, 2018
Comments
Please login to add a commentAdd a comment