
భారత్ కోసం షియోమి ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్
ధర రూ.12,999
- ఈ నెల 30 నుంచి అందుబాటులోకి
న్యూఢిల్లీ: షియోమి కంపెనీ భారత మార్కెట్‌ను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని రూపొందించిన మి 4ఐ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం ఆవిష్కరించింది. ఈ ఫోన్ ధర రూ.12,999గా నిర్ణయించామని షియోమి వైస్ ప్రెసిడెంట్ హ్యుగో బర్రా తెలిపారు. ఈ నెల 30 నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతాయి. దీనికోసం గురువారం నుంచే ఫ్లిప్‌కార్ట్‌లో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. వచ్చే నెల నుంచి హాంగ్‌కాంగ్, తైవాన్, సింగపూర్, మలేసియా, ఇండోనేషియాల్లో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెస్తారు.
భారత వినియోగదారుల అవసరాలు, అభిరుచులను దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్‌ను రూపొందించామని బర్రా తెలియజేశారు. ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత ఎంఐయూఐ సాఫ్ట్‌వేర్‌పై పనిచేసే ఈ డ్యూయల్ సిమ్ ఫోన్‌లో 5 అంగుళాల హెచ్‌డీ ఓజీఎస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2 జీబీ ర్యా మ్, 16 జీబీ మెమరీ, 13 మెగా పిక్సెల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4 జీ సపోర్ట్, 3,120 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.
డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాం
ఈ ఏడాది చివరికల్లా కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ భారత్‌లో డేటా సెంటర్‌ను ఏర్పా టు చేస్తామని హ్యుగో బర్రా చెప్పారు. దీనికి ఎంత మొత్తం వెచ్చిస్తున్నామన్నది వెల్లడించకపోయినా దీనికోసం షియోమి భారీ మొత్తంలోనే ఇన్వెస్ట్ చేయనున్నదని సమాచారం.