
సాక్షి,ముంబై: చైనీస్ మొబైల్ తయారీ దిగ్గజం షావోమి నూతన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎంఐ ఏ2 పేరుతో రెండవ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్ డివైస్‌ను ప్రస్తుతం లాంచ్ చేసింది. దీని ధరను రూ. 16,999గా నిర్ణయించింది. ప్రత్యేకంగా ఎంఐ, అమెజాన్ ద్వారా ప్రీ ఆర్డర్లు రేపు మధ్యాహ్నంనుంచి మొదలవుతాయి. ఆగస్టు 16నుంచి తొలి విక్రయాలు ప్రారంభం. త‍్వరలోనే 6జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా అందుబాటులోకి తేనుంది. దీని ధర రూ.22,000గా ఉండనుంది.
ఎంఐ ఏ 2 ఫీచర్లు
5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 18:9 రేషియో,
క్వాల్కం స్నాప్ డ్రాగన్ 660 ఎస్‌వోసీ, ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.1
4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్
12+20 ఎంపి డ్యుయల్ రియర్ కెమెరా
20ఎంపీ ఫ్రంట్ కెమెరా
3010ఎంఏహెచ్ బ్యాటరీ
ఇక లాంచింగ్ ఆఫర్ విషయానికి వస్తే రిలయన్స్ జియో ద్వారా రూ.2200 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. దీంతోపాటు 4.5 టీబీ డేటా కూడా ఉచితం.
Comments
Please login to add a commentAdd a comment