అదిరిపోయే ఫీచర్లతో వచ్చేసిన ఎంఐ 8  | Xiaomi Mi 8 Launched In China | Sakshi
Sakshi News home page

అదిరిపోయే ఫీచర్లతో వచ్చేసిన ఎంఐ 8 

Published Thu, May 31 2018 2:21 PM | Last Updated on Thu, May 31 2018 2:21 PM

Xiaomi Mi 8 Launched In China - Sakshi

ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌

రూమర్లన్నింటిన్నీ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి నిజం చేసింది. తన 8వ వార్షికోత్సవతం సందర్భంగా ఎంఐ 8 ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను షావోమి చైనా వేదికగా లాంచ్‌ చేసింది. 3డీ ఫేస్‌ అన్‌లాక్‌, డ్యూయల్‌ జీపీఎస్‌ సిస్టమ్‌తో దీన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. నోచ్‌ డిస్‌ప్లేతో వచ్చిన తొలి షావోమి స్మార్ట్‌ఫోన్‌ ఇదే. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చిన 3డీ ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌, చీకటి వాతావరణంలో కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేయనుంది. కంపెనీ సీఈవో లీ జున్‌ దీన్ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. ఎంఐ 8 అద్భుతమైన అన్‌టుటు స్కోర్‌ను సాధించిందని, స్నాప్‌డ్రాగన్‌ 845తో రూపొందిన అన్ని డివైజ్‌ల కంటే దీనికే ఎక్కువ స్కోర్‌ వచ్చిందని లాంచింగ్‌ సందర్భంగా కంపెనీ చెప్పింది. డిస్‌ప్లే పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.21 అంగుళాల ఫుల్‌-స్క్రీన్‌ డిస్‌ప్లను కలిగి ఉంది. దీనికి శాంసంగ్‌ అమోలెడ్‌ ప్యానల్‌ను వాడారు. 3.5 ఎంఎం ఆడియోజాక్‌ కూడా ఉంది. ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌తో పాటు, ఎంఐ 8 ఎస్‌ఈ, 75 అంగుళాల ఎంఐ టీవీ 4, ఎంఐ వీఆర్‌ స్టాండలోన్‌, ఎంఐ బ్యాండ్‌ 3ను కూడా లాంచ్‌ చేసినట్టు కంపెనీ తెలిపింది.

ఎంఐ 8 ఫీచర్లు...
6.21 అంగుళాల ఫుల్‌ స్క్రీన్‌
ఏఐ సామర్థ్యంతో 12 మెగాపిక్సెల్‌ డ్యూయల్‌ కెమెరా
20 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా, ఫేస్‌ అన్‌లాక్‌
డ్యూయల్‌ ఫ్రీక్వెన్సీ జీపీఎస్‌
వెనుకవైపు ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్‌-సీ
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ఎస్‌ఓసీ
6 జీబీ ర్యామ్‌
64 జీబీ, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్లు
8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌తో ఎక్స్‌ప్లోర్‌ ఎడిషన్‌
3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ధరలు... 6జీబీ ర్యామ్‌, 64 జీబీ వెర్షన్‌ ధర 2,699 సీఎన్‌వై(సుమారు రూ.28,600) 
6 జీబీ ర్యామ్‌, 128 జీబీ వెర్షన్‌ ధర 2,999 సీఎన్‌వై(సుమారు రూ.31,600)  
6 జీబీ ర్యామ్‌, 256 జీబీ వెర్షన్‌ ధర 3,299 సీఎన్‌వై(సుమారు రూ.34,800) 
8 జీబీ ర్యామ్‌తో వచ్చిన ఎక్స్‌ప్లోర్‌ ఎడిషన్‌ ధర 3,799 సీఎన్‌వై(సుమారు రూ.39,000) గా ఉంది
బ్లూ, గోల్డ్‌, లైట్‌ బ్లూ, బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటు
 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement