Mi 8
-
స్పెషల్ ఫీచర్లతో షావోమి స్మార్ట్ఫోన్లు
చైనా మొబైల్ మేకర్ షావోమీ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వైపు మొగ్గు చూపింది. ఒప్పో, వివో స్మార్ట్ఫోన్ల తరహాలోనే ఐఆర్ ఫేస్ అన్‌లాక్ ప్రధాన ఫీచర్‌గా నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. భారీ స్క్రీన్, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, ప్రెషర్ సెన్సిటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ఆకట్టుకునే ఫీచర్లతో ఎంఐ 8 ఫ్యామిలీ కొనసాగింపుగా ఎంఐ 8ప్రొ పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది. రూ.33,945 ప్రారంభ ధరకు ఈ ఫోన్ లభ్యం కానుంది. హై ఎండ్ వేరియంట్ ధర 38,000 రూపాయలుగా ఉండనుంది. దీంతోపాటు ఎంఐ 8 లైట్‌ను యూత్ ఎడిషన్ కూడా విడుదల చేసింది. ఎంఐ8 ప్రొ ఫీచర్లు 6.21 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2248 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్, 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 12+ 12ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 20 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఎంఐ8 లైట్(యూత్ ఎడిషన్) ఫీచర్లు 6.26 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 సాక్ 12 +5 ఎంపీ ద్వంద్వ వెనుక కెమెరా 24ఎంసీ సెల్ఫీ కెమెరా 3,350 ఎంఏహెచ్‌బ్యాటరీ 4జీబీ /64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు 15వేలు, అలాగే 6జీబీ/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,000. అలాగే 6జీబీ /128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. సుమారు 21, 000 -
వన్‌ప్లస్ 6 రికార్డులను బద్దలుకొట్టిన ఎంఐ 8
వన్‌ప్లస్ కంపెనీ తాజాగా లాంచ్ చేసిన వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను, అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన షావోమి ఎంఐ 8 బద్దలు కొట్టింది. లాంచ్ అయిన కొన్ని రోజుల్లో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఎంఐ 8, పది లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ మైలురాయిని చేధించడానికి ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌కు కేవలం 18 రోజుల్లో పట్టిందని కంపెనీ తెలిపింది. జూన్ 5న తొలిసారి షావోమి ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌ను విక్రయానికి తీసుకొచ్చింది. ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్ 10 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేసిందన్న విషయాన్ని కంపెనీ గ్లోబల్ అధికార ప్రతినిధి డోనోవాన్ సంగ్ ట్విటర్ ద్వారా ధృవీకరించారు. ‘జూన్ 5న ఎంఐ 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్ తొలిసారి విక్రయానికి వచ్చింది. కేవలం 18 రోజుల్లోనే మేము 10 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేశాం’ అని ట్విటర్లో పేర్కొన్నారు. ఈ మైలురాయిని చేరుకోవడానికి వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌కు 22 రోజుల సమయం పట్టింది. అంటే వన్‌ప్లస్ 6 రికార్డులను ఎంఐ 8 బద్దలు కొట్టేసిందన్న మాట. ఇక ఎంఐ 8 ఫీచర్ల విషయానికి వస్తే.. 6.21 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ నాచ్డ్ డిస్ప్లేను ఇది కలిగి ఉంది 2.5 కర్వ్డ్ గ్లాస్‌తో గ్లాస్, మెటల్ డిజైన్‌తో రూపొందింది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్ 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభ్యం 12 ఎంపీ + 12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాలు 20 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3400 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత్‌కు కూడా రాబోతుంది. -
అదిరిపోయే ఫీచర్లతో వచ్చేసిన ఎంఐ 8
రూమర్లన్నింటిన్నీ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి నిజం చేసింది. తన 8వ వార్షికోత్సవతం సందర్భంగా ఎంఐ 8 ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను షావోమి చైనా వేదికగా లాంచ్ చేసింది. 3డీ ఫేస్ అన్‌లాక్, డ్యూయల్ జీపీఎస్ సిస్టమ్‌తో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. నోచ్ డిస్ప్లేతో వచ్చిన తొలి షావోమి స్మార్ట్‌ఫోన్ ఇదే. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అమర్చిన 3డీ ఫేస్ అన్‌లాక్ ఫీచర్, చీకటి వాతావరణంలో కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేయనుంది. కంపెనీ సీఈవో లీ జున్ దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఎంఐ 8 అద్భుతమైన అన్టుటు స్కోర్‌ను సాధించిందని, స్నాప్‌డ్రాగన్ 845తో రూపొందిన అన్ని డివైజ్‌ల కంటే దీనికే ఎక్కువ స్కోర్ వచ్చిందని లాంచింగ్ సందర్భంగా కంపెనీ చెప్పింది. డిస్ప్లే పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ 6.21 అంగుళాల ఫుల్-స్క్రీన్ డిస్‌ప్లను కలిగి ఉంది. దీనికి శాంసంగ్ అమోలెడ్ ప్యానల్‌ను వాడారు. 3.5 ఎంఎం ఆడియోజాక్ కూడా ఉంది. ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌తో పాటు, ఎంఐ 8 ఎస్ఈ, 75 అంగుళాల ఎంఐ టీవీ 4, ఎంఐ వీఆర్ స్టాండలోన్, ఎంఐ బ్యాండ్ 3ను కూడా లాంచ్ చేసినట్టు కంపెనీ తెలిపింది. ఎంఐ 8 ఫీచర్లు... 6.21 అంగుళాల ఫుల్ స్క్రీన్ ఏఐ సామర్థ్యంతో 12 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫేస్ అన్‌లాక్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్ వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్-సీ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ఎస్ఓసీ 6 జీబీ ర్యామ్ 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో ఎక్స్ప్లోర్ ఎడిషన్ 3400 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు... 6జీబీ ర్యామ్, 64 జీబీ వెర్షన్ ధర 2,699 సీఎన్‌వై(సుమారు రూ.28,600) 6 జీబీ ర్యామ్, 128 జీబీ వెర్షన్ ధర 2,999 సీఎన్‌వై(సుమారు రూ.31,600) 6 జీబీ ర్యామ్, 256 జీబీ వెర్షన్ ధర 3,299 సీఎన్‌వై(సుమారు రూ.34,800) 8 జీబీ ర్యామ్‌తో వచ్చిన ఎక్స్ప్లోర్ ఎడిషన్ ధర 3,799 సీఎన్‌వై(సుమారు రూ.39,000) గా ఉంది బ్లూ, గోల్డ్, లైట్ బ్లూ, బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటు