
షావోమి తన రెడ్‌మి 5ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఇక త్వరలోనే ఆఫ్‌లైన్‌గా అందుబాటులోకి తీసుకురాబోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్టోర్ల ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించబోతున్నట్టు షావోమి తెలిపింది. రెండు వేరియంట్లలో లాంచ్ అయిన రెడ్‌మి 5ఏ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, ఎం.కామ్, ఎంఐ హోమ్ స్టోర్లలో అందుబాటులో ఉంది. అయితే 3జీబీ ర్యామ్, 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్ ఆఫ్‌లైన్ పార్టనర్ల వద్ద అమ్మకానికి వస్తుందని కంపెనీ తెలిపింది. అదేవిధంగా 2జీబీ ర్యామ్ వేరియంట్ ఎంఐ పార్టనర్ స్టోర్ల వద్ద మాత్రమే అమ్మకానికి వస్తున్నట్టు పేర్కొంది. 2జీబీ ర్యామ్ వేరియంట్‌ను రూ.4,999కు విక్రయిస్తోంది. 3జీబీ ర్యామ్ వెర్షన్‌ను కూడా ఆన్‌లైన్, ఎంఐ హోమ్ స్టోర్ల వద్ద రూ.6,999కు అమ్ముతోంది. కానీ ఆఫ్‌లైన్‌కు వచ్చేసరికి ఈ వేరియంట్ ధరను షావోమి పెంచేసింది. దీని రూ.7,499 వరకు విక్రయిస్తామని కంపెనీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అంటే లాంచింగ్ ధర కంటే రూ.500కు పైగా ఎక్కువ.
రెడ్‌మి 5ఏ స్పెషిఫికేషన్లు..
హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్
ఎంఐయూఐ 9 ఆధారిత ఆండ్రాయిడ్ నోగట్
5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
1.4గిగాహెడ్జ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్
2జీబీ/ 3జీబీ ర్యామ్
16జీబీ/ 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్
128జీబీ వరకు విస్తరణ మెమరీ
13 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment