
బెజెల్-లెస్ డిస్‌ప్లేతో విడుదలైన షావోమి ఎంఐ మిక్స్ 2 తొలిసారి భారత్‌లో విక్రయానికి వచ్చింది. నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్‌లలో ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. రూ.35,999కు గత వారంలోనే ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదలైంది. వన్‌ప్లస్ 5, నోకియా 8, ఎల్‌జీ జీ6 స్మార్ట్‌ఫోన్లకు పోటీగా ఎంఐ మిక్స్2ను షావోమి మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనుగోలుచేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను, ఒకవేళ ఫోన్ పే ద్వారా కొనుగోలు చేస్తే 20 శాతం క్యాష్‌బ్యాక్‌ను, యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఎంఐ. కామ్‌లో అయితే కంపెనీ 12 నెలల పాటు ఉచితంగా హంగామా మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.
ఎంఐ మిక్స్2 ఫీచర్లు...
5.99 అంగుళాల డిస్‌ప్లే
2.4 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
6జీబీ/8జీబీ ర్యామ్
64జీబీ/128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
12 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సార్
3400 ఎంఏహెచ్ బ్యాటరీ
4జీ, వాయిస్‌ఓవర్ ఎల్టీఈ
Comments
Please login to add a commentAdd a comment