Mi MIX 2 First Sale
-
ఆ ఫోన్ సేల్ నేటి నుంచే..
బెజెల్-లెస్ డిస్ప్లేతో విడుదలైన షావోమి ఎంఐ మిక్స్ 2 తొలిసారి భారత్‌లో విక్రయానికి వచ్చింది. నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్‌లలో ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. రూ.35,999కు గత వారంలోనే ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదలైంది. వన్‌ప్లస్ 5, నోకియా 8, ఎల్జీ జీ6 స్మార్ట్ఫోన్లకు పోటీగా ఎంఐ మిక్స్2ను షావోమి మార్కెట్లోకి తీసుకొచ్చింది. హెచ్డీఎఫ్సీ కార్డుతో కొనుగోలుచేస్తే 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను, ఒకవేళ ఫోన్ పే ద్వారా కొనుగోలు చేస్తే 20 శాతం క్యాష్‌బ్యాక్‌ను, యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఎంఐ. కామ్‌లో అయితే కంపెనీ 12 నెలల పాటు ఉచితంగా హంగామా మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఎంఐ మిక్స్2 ఫీచర్లు... 5.99 అంగుళాల డిస్ప్లే 2.4 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ 6జీబీ/8జీబీ ర్యామ్ 64జీబీ/128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 12 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫింగర్ ప్రింట్ సెన్సార్ 3400 ఎంఏహెచ్ బ్యాటరీ 4జీ, వాయిస్ఓవర్ ఎల్టీఈ -
తొలి సేల్‌లోనే ఎంఐ మిక్స్2 అదరగొట్టింది..
షావోమి ఫోన్లకు వచ్చే డిమాండ్ అంతా ఇంతా కాదు. విక్రయానికి వచ్చిన ఈ కంపెనీ స్మార్ట్ఫోన్లు సెకన్లలోనే సంచలనాలు సృష్టిస్తుంటాయి. బెజెల్-లెస్ ఎడ్జ్-టూ-ఎడ్జ్ డిస్ప్లేతో ఇటీవల షావోమి తీసుకొచ్చిన ఎం మిక్స్2 స్మార్ట్‌ఫోన్, చైనాలో తొలి ఫ్లాష్ సేల్కు వచ్చింది. ఫ్లాష్ సేల్కు వచ్చిన సెకన్ల వ్యవధిలోనే ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తిగా అమ్ముడుపోయింది. కేవలం 58 సెకన్లలోనే ఈ ఫోన్లన్నీ అమ్ముడుపోవడం విశేషం. అయితే ఎన్ని యూనిట్లు అమ్ముడుపోయాయో కంపెనీ వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఎంఐ నోట్ 3 కూడా విక్రయానికి వచ్చింది. చైనీస్ వెబ్సైట్ మైడ్రైవర్స్ రిపోర్టు ప్రకారం కేవలం 58 సెకన్లలలో షావోమి ఎంఐ మిక్స్2 యూనిట్లన్నీ పూర్తిగా అమ్ముడుపోయినట్టు తెలిసింది. ఈ వారం మొదట్లోనే ఎంఐ మిక్స్2కు భారీగా రిజిస్ట్రేషన్ల వెల్లువ కొనసాగిన సంగతి తెలిసిందే. ఐదు లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లను ఇది అధిగమించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు భారీ ఎత్తున్న డిమాండ్ పెరుగుతున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ తర్వాత సేల్ సెప్టెంబర్ 19న అందుబాటులోకి రానుంది. ఎంఐ మిక్స్ 2 స్పెషిఫికేషన్లు.... 5.99 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ఎస్ఓసీ 6జీబీ ర్యామ్ స్పెషల్ ఎడిషన్‌కు 8జీబీ వరకు ర్యామ్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 4జీ ఎల్టీవీ