
సాక్షి, అమరావతి: దేశంలోనే మొదటిసారిగా రాజధాని అమరావతిలో పర్యావరణహితమైన విద్యుత్ బైకులు ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నగరాన్ని కాలుష్య రహితంగా ఉంచేందుకు బ్యాటరీ వాహనాలను త్వరలో తీసుకువస్తున్నట్లు చెప్పారు. మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్ హాలులో నిర్వహిస్తున్న హ్యాపీ సిటీస్ సమ్మిట్‌లో రెండో రోజైన బుధవారం అక్కడి ఎగ్జిబిషన్ హాళ్లు, ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. అనంతరం సదస్సుకు హాజరైన విదేశీ ప్రతినిధులతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు.
షియోమీ ప్రతినిధులతో సీఎం భేటీ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం తిరుపతిలోని మారస సరోవర్ హోటల్‌లో షియోమీ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. షియోమీ ఫోన్ల తయారీ కంపెనీతో పాటు ఆ కంపెనీకి కాంపోనెంట్స్ సరఫరా చేసే 38 కంపెనీల (సప్లయర్స్)తో మాట్లాడ్డం జరిగిందని, 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఆయా కంపెనీలు ఆసక్తి చూపాయన్నారు. సెల్‌ఫోన్ విడిభాగాల తయారీకి షియోమీ కంపెనీ ముందుకు వచ్చిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment