
బీజింగ్: చైనా మొబైల్ మేకర్ షావోమి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గత ఏడాది ప్రారంభించిన మికు ఎడిషన్‌లో తాజాగా 'ఎంఐ 6ఎక్స్ హట్సన్ మికు' పేరుతో లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఎంఐ ఫాన్స్‌కోసం కేవలం 5వేల యూనిట్లను మాత్రమే విక్రయించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు 10వేల ఎంఏహెచ్ పవర్ బ్యాంకు, సెమి ట్రాన్సపరెంట్ కవర్, గిఫ్ట్‌కార్డు కూడా కస‍్టమర్లకు అందించనుంది. దీని ధర సుమారు రూ.21,900గా ఉంటుంది. ఇప్పటికే చైనాలో ప్రి బుకింగ్‌కు అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 3వ తేదీ నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమవుతాయని పేర్కొంది. అతి త్వరలోనే ఇది ఇండియన్ మార్కెట్లోకి రానుందని భావిస్తున్నారు. గ్లోబల్ వేరియంట్‌గా భావిస్తోన్న ఎంఏ 2ను ప్రపంచ మార్కెట్లలోకి తీసుకురాబోతున్నట్లు సమయంలోనేదీన్ని కూడా లాంచ్ చేయవచ్చని అంచనా.
ఎంఐ 6ఎక్స్ హట్సన్ మికు ఫీచర్లు
5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 660 ఎస్‌వోసీ
ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఎంఐయుఐ
2160×1080 రిజల్యూషన్
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్
20+20 ఎంపీ రియర్ కెమెరా
20 ఎంపీ సెల్ఫీ కెమెరా
3010 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment