
షావోమి ఎంఐ 7
చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి వచ్చే నెలల్లో మరో రెండు హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఎంఐ మిక్స్ 2ఎస్, ఎంఐ 7 పేర్లతో వీటిని మార్కెట్‌లోకి తీసుకొస్తుందని రిపోర్టులు వెలువడుతున్నాయి. ఎంఐ 7 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఇప్పటి నుంచే ఆన్‌లైన్ చక్కర్లు కొట్టడం ప్రారంభించాయి. ఈ ఫోన్‌కు సంబంధించి స్క్రీన్‌షాట్లు కూడా బయటికి వచ్చాయి.
ఒకవేళ తాజాగా విడుదలైన స్క్రీన్‌షాట్‌లు కనుక నిజమైతే, ఎంఐ 7 స్మార్ట్‌ఫోన్ 5.65 అంగుళాల ఫుల్-హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉండబోతుందని తెలుస్తోంది. అంతకముందు ఈ ఫోన్‌కు 6 అంగుళాల డిస్‌ప్లే ఉంటుందని కొన్ని రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ స్క్రీన్‌షాట్‌లోనే స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ రూపొందిందని, అత్యధిక మొత్తంలో 8జీబీ ర్యామ్‌ను ఇది ఆఫర్ చేస్తుందని తెలిసింది. 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇది ఆఫర్ చేస్తుందట. ఇటీవల విడుదలైన లీకేజీల్లో వివో కొత్తగా తీసుకొచ్చే ఎక్స్‌ప్లే7 స్మార్ట్‌ఫోన్ 10జీబీ ర్యామ్‌ను కలిగి ఉండనున్నట్టు టాక్.
కెమెరా పరంగా తీసుకుంటే షావోమి ఎంఐ 7 స్మార్ట్‌ఫోన్ 16 మెగాపిక్సెల్ లెన్సెస్‌తో డ్యూయల్ రియర్ కెమెరాను, ముందు వైపు 16 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సార్ కెమెరాను కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. ఎంఐ 6 స్మార్ట్‌ఫోన్‌కు 3350 ఎంఏహెచ్ సామర్థ్యం కల బ్యాటరీ ఉంటే, ఎంఐ 7కు 4480 ఎంఏహెచ్ సామర్థ్యంతో అతిపెద్ద బ్యాటరీ ఉన్నట్టు ఆ స్క్రీన్‌షాట్ తెలుపుతోంది. ఏప్రిల్‌లో ఈ ఫోన్ లాంచ్ అవొచ్చని... ప్రస్తుతం ఈ నెల చివరిలో జరుగబోయే ఎండబ్ల్యూఐసీ 2018లో ఎంఐ మిక్స్ 2ఎస్‌ను లాంచ్ చేస్తారని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment