రెడ్‌మి 5, 5 ప్లస్‌ లాంచ్‌ | Xiaomi Redmi 5, Redmi 5 Plus launched with 18:9 display | Sakshi
Sakshi News home page

రెడ్‌మి 5, 5 ప్లస్‌ లాంచ్‌

Published Fri, Dec 8 2017 9:07 AM | Last Updated on Fri, Dec 8 2017 9:35 AM

Xiaomi Redmi 5, Redmi 5 Plus launched with 18:9 display - Sakshi

షావోమి సరికొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది.  18:9 యాస్పెప్ట్‌ రేషియో డిస్‌ప్లేలతో రెడ్‌మి 5, రెడ్‌మి 5 ప్లస్‌   పేరుతో రెండు స్మార్ట్‌ఫోన్లను చైనాలో లాంచ్‌ చేసింది. రెడ్‌ మి 5 ను 2 జీబీ, 3జీబీ వేరియంట్స్‌,  5 ప్లస్‌ 3జీబీ, 4 జీబీ  రెండు వేరియంట్లలో  లభ్యంకానుంది. అలాగే బ్లాక్‌,గోల్డ్‌, లైట్‌ బ్లూ, రోజ్‌ గోల్డ్‌ కలర‍్లలో  ఈ డివైస్‌లు అందుబాటులో ఉంటాయి.  మిగతా  మార్కెట్లలో ఎపుడు అందుబాటులోకి వచ్చేది షావోమి ఇంకా ధృవీకరించలేదు.

రెడ్‌మి 5ఫీచర్లు
5.7 అంగుళాల హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే
యాస్పెక్ట్‌ రేషియో 18:9, 720x1440 పిక్సెల్‌ రిజల్యూషన్‌
స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ నోగట్‌ 7.0
4జీబీ ర్యామ్‌
64జీబీ స్టోరేజ్‌
స్టోరేజ్‌ను విస్తరించుకునే సదుపాయం
12ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ  సెల్ఫీ కెమెరా
3,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ
దీని ధర సుమారు  రూ.12,700లు. 2 జీబీ వేరియంట్‌ ధర రూ.7,800గా ఉంటుంది.
 
రెడ్‌మి 5 ప్లస్‌  ఫీచర్లు
5.99  అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
1080x2160 పిక్సెల్‌ రిజల్యూషన్‌
ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌,
3జీబీ ర్యామ్‌
32జీబీ స్టోరేజ్‌
స్టోరేజ్‌ను విస్తరించుకునే సదుపాయం
12ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ  సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఇక దీని ధర విషయానికి వస్తే  భారత మార్కెట్లో  సుమారు రూ. 9,700గా ఉంటుందని అంచనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement