
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న షావొమీ హైదరాబాద్‌లో మరో సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించింది. దీంతో కంపెనీ మొబైల్స్ కోసం నెలకొల్పిన సర్వీస్ సెంటర్ల సంఖ్య 1,000కి చేరుకుంది. 600 నగరాలు, పట్టణాల్లో ఇవి విస్తరించాయి.
ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా ఈ కేంద్రాల సంఖ్య రెండింతలైందని షావొమీ వైస్ ప్రెసిడెంట్ మను జైన్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. టీవీల కోసం 300 ప్రాంతాల్లో 500 సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ‘నెలకు 30 లక్షలపైగా ఫోన్లను విక్రయిస్తున్నాం. ఏడాదిలో అమ్మకాల పరంగా మూడింతల వృద్ధి సాధించాం. 2 సెకన్లకు ఒక ఫోన్‌ను తయారు చేసే సామర్థ్యం కంపెనీకి ఉంది. మూడింట రెండొంతుల విక్రయాలు ఆన్‌లైన్‌లోనే. వచ్చే ఏడాది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సేల్స్ సమానస్థాయికి చేరుతాయి’ అని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment