
రెడ్‌మి 5ఏ
చైనా మొబైల్ మేకర్ షావోమి లాంచ్ చేసిన దేశ్‌కా స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 5ఏ ధర పెరిగింది. ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను అసలు ధర 5,999 రూపాయలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు షావోమి ప్రకటించింది. ఈ కొత్త ధర ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్, ఎంఐ హోమ్ రిటైల్ స్టోర్లలో అప్లయ్ అవుతుందని చెప్పింది.
లాంచింగ్ సమయంలో రెడ్‌మి 5ఏ ప్రారంభ ధర 4,999 రూపాయలు మాత్రమే. 50 లక్షల యూనిట్లను విక్రయించిన అనంతరం దీన్ని అసలు ధర 5,999 రూపాయలకు తీసుకొస్తామని కంపెనీ లాంచింగ్ సమయంలోనే ప్రకటించింది. ప్రస్తుతం షావోమి అనుకున్న లక్ష్యాన్ని చేధించేసింది. దీంతో దీని ధరను వెయ్యి రూపాయలు పెంచేసి 5,999 రూపాయలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
రెండు వేరియంట్లలో రెడ్‌మి 5ఏను షావోమి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ ధర 5,999 రూపాయలు కాగ, 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ మోడల్ ధర 6,999 రూపాయలు. 8 రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఇది కలిగి ఉంది. మెమరీని పెంచడం కోసం ఈ ఫోన్‌లో మైక్రోఎస్టీ కార్డు స్లాటును కూడా అందుబాటులో ఉంచింది. డార్క్ గ్రే, రోజ్ గోల్డ్, గోల్డ్ రంగుల్లో ఇది లభ్యమవుతోంది.
రెడ్‌మి 5ఏ స్పెషిఫికేషన్లు..
డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్, ఆండ్రాయిడ్ నోగట్, 5 అంగుళాల డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 425 ఎస్‌ఓసీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ సెన్సార్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని స్పెషిఫికేషన్లు.
Comments
Please login to add a commentAdd a comment