8వ వార్షికోత్సవం : గ్రాండ్‌గా ఆ ఫోన్‌ రిలీజ్‌ | Mi 8 Launch Date Is May 31, Xiaomi Confirms | Sakshi
Sakshi News home page

8వ వార్షికోత్సవం : గ్రాండ్‌గా ఆ ఫోన్‌ రిలీజ్‌

Published Wed, May 23 2018 5:18 PM | Last Updated on Tue, Jun 4 2019 6:39 PM

Mi 8 Launch Date Is May 31, Xiaomi Confirms - Sakshi

షావోమి మరికొన్ని రోజుల తన 8వ వార్షికోత్సవాన్ని ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోబోతుంది. ఈ వార్షికోత్సవ సందర్భంగా వచ్చే వారం ఎంఐ సిరీస్‌లో కొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని షావోమి ధృవీకరించేసింది. మే 31న ఎంఐ 8 లాంచ్‌ ఈవెంట్‌ను షావోమి నిర్వహిస్తోంది. అప్‌కమింగ్‌ లాంచ్‌పై ధృవీకరణ చేసిన షావోమి, ఎంఐ 6 సక్సెసర్‌గా ఎంఐ 7ను లాంచ్‌ చేయనుందనే విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దాని బదులు 8వ వార్షికోత్సవ సందర్భంగా ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌నే తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.

ఆపిల్‌ ఫేస్‌ ఐడీకి ధీటుగా 3డీ ఫేసియల్‌ సెన్సింగ్‌ టెక్నాలజీతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ లాంచ్‌ చేయబోతున్నట్టు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. వైబోలో టీజర్‌ ఇమేజ్‌ను పోస్టు చేసిన కంపెనీ ఎంఐ 8 లాంచింగ్‌ను ధృవీకరించింది. అంతేకాక కంపెనీ గ్లోబల్‌ అధికార ప్రతినిధి దోనోవాన్‌ సంగ్‌ కూడా ప్రత్యేకంగా మరో ట్వీట్‌ చేసి కొత్త లాంచింగ్‌ను ప్రకటించారు. ‘మేము 8వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. షెన్జెన్‌లో మే 31న తమ వార్షిక ఫ్లాగ్‌షిప్‌ ప్రొడక్ట్‌ ఎంఐ 8ను లాంచ్‌ చేస్తున్నాం’ అని సంగ్‌ ట్వీట్‌ చేశారు. కంపెనీ ఇప్పటికే ఈ ఈవెంట్‌కు సంబంధించిన టిక్కెట్లను విక్రయించడం ప్రారంభించింది. 

షావోమి ఎంఐ 8 రూమర్‌ స్పెషిఫికేషన్లు...
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ఎస్‌ఓసీ
8జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్‌ ఓరియో
డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement