కరోనా మహమ్మారి రాకతో పలు ఈ-కామర్స్ వెబ్‌సైట్లు కస్టమర్లకు అందించే ఫెస్టివల్ సేల్స్‌ను నిలిపివేశాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల కాస్త తగ్గముఖం పట్టడంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ-కామర్స్ సంస్థలు పోటాపోటీగా ఫెస్టివల్ సేల్స్‌ను కస్టమర్లకు అందించాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన కస్టమర్లకోసం మొబైల్ సేవింగ్ డేస్ సేల్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా మరో దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ అదే బాటలో నడుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకోసం ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బోనాంజా సేల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. (చదవండి:WhatsApp:మీరు అనుకుంటే వాట్సాప్‌లో కనిపించకుండా చేయవచ్చు.!)
ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్స్ నేటితో ప్రారంభమై ఐదు రోజుల పాటు ఆగస్టు 23 వరకు కొనసాగనుంది. ఈ సేల్స్‌లో భాగంగా పలు మొబైల్స్‌పై , మొబైల్ యాక్సేసరిస్‌పై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఐఫోన్ 12 మినీ, పోకో ఎం 3, మోటో జి 60 , ఇన్‌ఫినిక్స్ హాట్ 10 ఎస్ వంటి స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డీల్స్, డిస్కౌంట్‌లను ఫ్లిప్‌కార్ట్ అందించనుంది. ఐఫోన్ 12, రియల్‌మీ సి 20, ఒప్పో ఎఫ్ 19 వంటి మోడళ్లపై ప్రీపెయిడ్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో భాగస్వామ్యమై ఎంపిక చేసిన ఫోన్‌లపై తక్షణ డిస్కౌంట్లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ మార్కెట్లో అందుబాటులోని ప్రముఖ ఫోన్లకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.
మొబైల్ బొనాంజా సేల్స్‌లో ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న పలు ఆఫర్ల వివరాలు..!
ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ ఐఫోన్ 12 మినీ స్మార్ట్‌ఫోన్‌ను ధర రూ. 59,999 అందిస్తోంది. ఐఫోన్ ఎస్‌ఈ (2020) స్మార్ట్‌ఫోన్ ధర రూ. 34,999 అందుబాటులో ఉండనుంది. ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్‌ను రూ. 48,999 అందించనుంది. ఐఫోన్ ఎక్స్ ఆర్‌ను రూ. 41,999, ఐఫోన్ 11 ప్రోను రూ. 74,999 కు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. మోటో జీ60 స్మార్ట్‌ఫోన్‌ను రూ. 16,999 అందిస్తుంది.
పోకో ఎమ్3ను రూ. 10,499 కాగా, ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 5 ను రూ. 6,999 అందించనుంది.
(చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!)
Comments
Please login to add a commentAdd a comment