
మొబైల్ ప్రియుల కోసం మొబైల్స్ బొనాంజా సేల్ ను ఫ్లిప్‌కార్ట్ తీసుకోని వచ్చింది. ఈ మొబైల్ బొనాంజా సేల్ నేటి(ఫిబ్రవరి 24) నుంచి ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ లో ఆపిల్, మోటరోలా, పోకో, రియల్‌మీ, శామ్‌సంగ్, వివో, షియోమీతో పాటు ఇతర బ్రాండ్‌ల మీద ఆఫర్లు ఉన్నాయి.
రియల్‌మీ నార్జో 20ఏ స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.10,999కాగా ఆఫర్ కింద ధర రూ.8,499కు లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు పొందవచ్చు. పోకో సీ3 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,499కాగా ఆఫర్ కింద ధర రూ.6,999కు లభిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు పొందవచ్చు. పోకో ఎక్స్3 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.17,999 కాగా ఆఫర్ కింద రూ.16,999కు లభిస్తుంది. ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ 64జీబీ వేరియంట్ అసలు ధర రూ.54,900కాగా ఆఫర్ కింద రూ.49,999కు లభిస్తుంది. ఇలా మొత్తం 25 స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ లో భారీ డిస్కౌంట్ అందిస్తుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment