రజనీ ఫొటోలతో ఏం చేశారో తెలుసా? | Brand 'Kabali' now on mobile phones and coffee mugs | Sakshi
Sakshi News home page

రజనీ ఫొటోలతో ఏం చేశారో తెలుసా?

Jul 11 2016 1:32 PM | Updated on Sep 4 2017 4:37 AM

రజనీ ఫొటోలతో ఏం చేశారో తెలుసా?

రజనీ ఫొటోలతో ఏం చేశారో తెలుసా?

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘బ్రాండ్’గా మారిపోయారు.

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ ‘బ్రాండ్’గా మారిపోయారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘కబాలి’  పోస్టర్లు ఎయిర్ ఏషియా విమానాలపై దర్శనమిస్తున్నాయి. సూపర్ స్టార్ పేరుతో ప్రయాణికులకు అందుబాటు ధరలో తమ విమానాల్లో తరలించేందుకు  ఎయిర్ ఏషియా ముందుకు వచ్చింది. ఇదిలావుంచితే ఇప్పుడు రజనీకాంత్ ఫొటోలు, డైలాగ్స్ తో అత్యధిక నాణ్యత కలిగిన స్మార్ట్ఫోన్ కవర్లు, కాఫీ కప్పులు మార్కెట్ లోకి వచ్చాయి. ’కవరిటప్’ అనే సంస్థ వీటిని తయారు చేసింది.

‘కబాలి’  పోస్టర్లతో కాకుండా తమ సొంత డిజైన్లతో వీటిని రూపొందించామని కవరిటప్ వ్యవస్థాపకుడు రొనాక్ సర్దా తెలిపారు. రజనీ కాంత్ పాపులర్ డైలాగులు, ఫొటోలు, సినిమాల పేర్లతో ట్రెండీగా స్మార్ట్ఫోన్ కవర్లు తయారు చేశామని చెప్పారు. తమ వెబ్సైట్ లో వందకుపైగా మొబైల్ కవర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కాఫీ కప్పులు, పోస్టర్లు, టీ-షర్టులు రూపొందించామన్నారు.

ఫోన్ కవర్లు రూ. 499 నుంచి ప్రారంభమవుతాయన్నారు. కాఫీ మగ్గులు, పోస్టర్లు రూ.249, రూ.299 ధరల్లో అందుబాటులో ఉన్నాయి. అన్ని వయసులు వారు రజనీ కాంత్ కు అభిమానులుగా ఉన్నారని, వారికి నచ్చితే తమ బిజినెస్ క్లిక్ అయినట్టేనని రొనాన్ సర్దా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement