coffee mugs
-
టెస్లాలో కాఫీ కప్పుల దొంగలు.. 65 వేల కప్పులు మాయం!
టెస్లా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. బిలియనీర్ ఇలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ ఇది. ప్రపంచవ్యాప్తంగా టెస్లా ఫ్యాక్టరీల్లో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే జర్మనీలోని బెర్లిన్ ఫ్యాక్టరీలో కాఫీ మగ్లు మాయవుతున్నాయట.కాఫీ మగ్‌ల దొంగతనం గురించి స్వయంగా టెస్లా ప్లాంట్ మేనేజర్ తెలిపారు. ప్లాంట్ మేనేజర్ ఆండ్రీ థిరిగ్ ఒక స్టాఫ్ మీటింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారని జర్మనీకి చెందిన హ్యాండెల్స్‌బ్లాట్ వార్తాపత్రిక నివేదించింది.బెర్లిన్‌కు ఆగ్నేయంగా ఉన్న ఒక విశాలమైన కాంప్లెక్స్‌లో దాదాపు 12,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్న టెస్లా ఫ్యాక్టరీలో "నేను మీకు ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పబోతున్నాను" అని థిరిగ్ చెప్పారు. "మేం ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి మేము 65,000 కాఫీ మగ్‌లను కొనుగోలు చేశాం. మరిన్ని కాఫీ కప్పులు కొనడానికి ఆర్డర్లను ఆమోదించడంలో నేను విసిగిపోయాను" అంటూ నవ్వుతూ పేర్కొన్నారు. దొంగతనాలు ఆపకపోతే బ్రేక్ రూమ్‌లలో పాత్రలేవీ మిగలవు అంటూ చమత్కరించారు.ఇటీవల టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ ఆదేశాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెస్లా ఫ్యాక్టరీలలో 10% ఉద్యోగులను తొలగించారు. దీంతో అనేక మంది తాత్కాలిక, పార్ట్‌టైమ్ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. -
రజనీ ఫొటోలతో ఏం చేశారో తెలుసా?
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ ‘బ్రాండ్’గా మారిపోయారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘కబాలి’ పోస్టర్లు ఎయిర్ ఏషియా విమానాలపై దర్శనమిస్తున్నాయి. సూపర్ స్టార్ పేరుతో ప్రయాణికులకు అందుబాటు ధరలో తమ విమానాల్లో తరలించేందుకు ఎయిర్ ఏషియా ముందుకు వచ్చింది. ఇదిలావుంచితే ఇప్పుడు రజనీకాంత్ ఫొటోలు, డైలాగ్స్ తో అత్యధిక నాణ్యత కలిగిన స్మార్ట్‌ఫోన్ కవర్లు, కాఫీ కప్పులు మార్కెట్ లోకి వచ్చాయి. ’కవరిటప్’ అనే సంస్థ వీటిని తయారు చేసింది. ‘కబాలి’ పోస్టర్లతో కాకుండా తమ సొంత డిజైన్లతో వీటిని రూపొందించామని కవరిటప్ వ్యవస్థాపకుడు రొనాక్ సర్దా తెలిపారు. రజనీ కాంత్ పాపులర్ డైలాగులు, ఫొటోలు, సినిమాల పేర్లతో ట్రెండీగా స్మార్ట్‌ఫోన్ కవర్లు తయారు చేశామని చెప్పారు. తమ వెబ్సైట్ లో వందకుపైగా మొబైల్ కవర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కాఫీ కప్పులు, పోస్టర్లు, టీ-షర్టులు రూపొందించామన్నారు. ఫోన్ కవర్లు రూ. 499 నుంచి ప్రారంభమవుతాయన్నారు. కాఫీ మగ్గులు, పోస్టర్లు రూ.249, రూ.299 ధరల్లో అందుబాటులో ఉన్నాయి. అన్ని వయసులు వారు రజనీ కాంత్ కు అభిమానులుగా ఉన్నారని, వారికి నచ్చితే తమ బిజినెస్ క్లిక్ అయినట్టేనని రొనాన్ సర్దా పేర్కొన్నారు.