మహిళలకు ‘స్త్రీనిధి’ ఫోన్లు! | Strinidhi phones to womens | Sakshi
Sakshi News home page

మహిళలకు ‘స్త్రీనిధి’ ఫోన్లు!

Published Sun, Feb 5 2017 4:15 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

మహిళలకు ‘స్త్రీనిధి’ ఫోన్లు!

మహిళలకు ‘స్త్రీనిధి’ ఫోన్లు!

డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించేందుకే..
♦ ఈ ఏడాది రూ.50 కోట్లతో 84 వేల మందికి ఫోన్లు
♦ స్త్రీనిధి బ్యాంకు మేనేజింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీలను (డిజిటలైజేషన్‌) ప్రోత్స హించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు మొబైల్‌ ఫోన్లు అందించాలని స్త్రీనిధి బ్యాంకు నిర్ణయించింది. ఈ ఏడాది రూ.50 కోట్లతో దాదాపు 84 వేల మందికి డిజిటల్‌ ఫోన్లను అందించనుంది. డిజిటలైజేష న్‌ను ప్రోత్సహించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్న ట్లు స్త్రీనిధి బ్యాంకు వెల్లడించింది. శనివారం సచివాలయంలో స్త్రీనిధి క్రెడిట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ కమిటీ సమా వేశం జరిగింది.

బ్యాంకు చైర్‌పర్సన్‌ అనిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామీణాభి వృద్ధి శాఖకు ఇన్‌చార్జి స్పెషల్‌ సీఎస్‌గా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, కమిష నర్‌ నీతూకుమారి ప్రసాద్, ఆర్థిక శాఖ కార్య దర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఆర్‌సీఎస్, మెప్మా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మేనేజింగ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఎండీ జి.విద్యాసాగర్‌రెడ్డి వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు మొబైల్‌ ఫోన్‌ సమకూర్చే నిమిత్తం ఒక్కో మహిళకు రూ.6 వేల చొప్పున స్త్రీనిధి బ్యాంకు రుణమిస్తోందని ఎండీ చెప్పారు. రుణాన్ని పొందిన మహిళలు నెలకు రూ.275 చొప్పున కనీస వడ్డీతో 24 నెలల్లోపు చెల్లించాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు వారికి నచ్చిన మోడల్, నచ్చిన కంపెనీ మొబైల్‌ను తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు.

మరుగుదొడ్ల నిర్మాణానికి రుణాలు
స్వచ్ఛ భారత్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతా ల్లోని స్వయం సహాయక మహిళల కుటుం బాల్లో మరుగు దొడ్డి నిర్మాణానికయ్యే ఖర్చు రూ.12 వేలను రుణంగా అందిస్తామని, 12 నెలల్లోపు రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని ఎండీ విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్నందున  నిధులు వచ్చేలోగా స్త్రీనిధి బ్యాంక్‌ రుణమిస్తుం దన్నారు. అలాగే వికలాంగులైన (ఎస్‌హెచ్‌జీ మహిళల) పిల్లలకు మెరుగైన శిక్షణ  కోసం సెర్ప్‌ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 70 నైబర్‌హుడ్‌ కేంద్రాలకు ఆర్థిక తోడ్పాటును అందించాలని బ్యాంక్‌ నిర్ణయించింది. బ్యాంకు నికర ఆదా యంలో 2% (రూ.80 లక్షల) నిధుల ను కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద ఆయా నైబర్‌హుడ్‌ కేంద్రాలకు అందించనున్నట్లు  ఎండీ తెలిపారు. స్త్రీనిధి బ్యాంక్‌ కింద రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే నష్ట పరిహారం చెల్లించాలనే ప్రతిపా దనను కమిటీ ఆమోదించింది. వివిధ స్థాయి ల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబాలకు రూ.50 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు ఈ తరహా పరిహారం అందించనున్నారు.

రుణ లక్ష్యాన్ని చేరకపోవడంపై అసంతృప్తి
స్త్రీనిధి బ్యాంక్‌ వార్షిక రుణ లక్ష్యాన్ని చేరుకో వడంలో వెనుకబడటం పట్ల మేనేజింగ్‌ కమిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,600 కోట్ల రుణాలను స్వయం సహాయక సంఘాలకు అందించాల్సి ఉండగా, 10 నెలలు గడిచినా రూ.650 కోట్ల మేరకే రుణాలిచ్చారు. రుణ లక్ష్యంలో వెనుక బాటుకు కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయమే కారణమని.. 2, 3 నెలల పాటు రుణాలను నగదుగా ఇచ్చేందుకు క్షేత్ర స్థాయి లో విముఖత వ్యక్తం చేశారని వివరణ ఇచ్చా రు. మార్చిలోగా లక్ష్యాన్ని చేరుకునేం దుకు చర్యలు చేపట్టినట్లు విద్యాసాగర్‌రెడ్డి పేర్కొ న్నారు. రాజస్థాన్, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో మహిళలకు అక్కడి ప్రభుత్వాలు సూక్ష్మ రుణాలను అందించేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసేందుకు ఆయా రాష్ట్రాలతో అవగాహన ఒప్పందం కుదిరిందని విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు.

సభ్యుల వద్దకే చైర్‌పర్సన్‌
సాధారణంగా ఏ సంస్థకు సంబంధిం చిన మేనేజింగ్‌ కమిటీ సమావేశమైనా సదరు సంస్థ చైర్మన్‌ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఆ కమిటీలో సభ్యులుగా ఉన్న అధికారులు, అనధికారులు చైర్మన్‌ ఉండే కార్యాలయా నికి రావాలి. అయితే.. శనివారం స్త్రీనిధి బ్యాంక్‌ మేనేజింగ్‌ కమిటీ సమావేశం మాత్రం చైర్మన్‌ ఉండే బ్యాంక్‌ ప్రాంగ ణంలో కాకుండా, కమిటీ సభ్యులు ఉన్న సచివాలయంలో జరగడం గమనార్హం. సచి వాలయంలో సమావేశమై తేనే వస్తామని కొందరు సభ్యులు భీష్మించుకుని కూర్చోవడంతో చివరికి బ్యాంక్‌ చైర్‌పర్సనే సచివాలయానికి వచ్చి మేనేజింగ్‌ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement