లండన్ : స్మార్ట్ ఫోన్లతో రోజంతా గడిపే యువతకు తాజా అథ్యయనం ఊరట ఇస్తోంది. సెల్‌ఫోన్లతో బ్రైన్ క్యాన్సర్ రాదని, మొబైల్ రేడియేషన్ బ్రెయిన్‌లో కణుతులకు దారితీస్తుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని అతిపెద్ద అథ్యయనం వెల్లడించింది. మొబైల్ ఫోన్లు వెలువరించే రేడియేషన్‌తో బ్రైన్ ట్యూమర్ల ముప్పు ఉందనేందుకు 9000 మందిపై నిర్వహించిన తమ అథ్యయనంలో ఎలాంటి ఆధారాలూ లభ్యం కాలేదని స్పానిష్ పరిశోధకులు వెల్లడించారు.
కాగా మొబైల్ ఫోన్లు వెలువరించే ఎలక్ర్టోమాగ్నెటిక్ ఫీల్డ్ (ఈఎంఎఫ్) రేడియేషన్‌తో జన్యువులు దెబ్బతిని క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని 2011లో క్యాన్సర్‌పై అంతర్జాతీయ పరిశోధన సంస్థ హెచ్చరించింది. అయితే ఈ రేడియేషన్‌తో క్యాన్సర్ ముప్పుపై స్పష్టమైన ఆధారాలు తమ అథ్యయనంలో లభించలేదని స్పానిష్ పరిశోధకులు స్పష్టం చేశారు.
ఈఎంఎఫ్ రేడియేషన్ త్వరితగతిన వ్యాప్తి చెందుతుందనే అంచనాతో గతంలో క్యాన్సర్ ముప్పుపై అంచనాకు వచ్చారని, అయితే తమ అథ్యయనంలో సెల్ ఫోన్‌ల వాడకంతో బ్రైన్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందన్న దిశగా ఎలాంటి ఆధారాలు వెల్లడికాలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ దిశగా మరిన్ని పరిశోధనలు అవసరమని వారు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment