లక్నో : యూనివర్సిటీలు, కాలేజ్‌ల్లో మొబైల్స్ ఫోన్ల వాడకంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించిందనే వార్తలు గత వారం రోజులుగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేలింది. తాము విద్యాసంస్థల్లో మొబైల్స్ వాడకంపై ఎటువంటి నిషేధం విధించలేదని యూపీ ఉన్నత విద్యాశాఖ తెలిపింది. మొబైల్స్ వాడకంపై నిషేధం విధించినట్టు వచ్చిన వార్తలో ఏ మాత్రం నిజం లేదని ఆ శాఖ డైరక్టర్ వందన శర్మ స్పష్టం చేశారు. తాము అలాంటి సర్క్యులర్ జారీ చేయలేదని వెల్లడించారు. ఈ వార్తలను యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ కూడా ఖండించారు.
కాగా, యూపీ ప్రభుత్వం కాలేజ్‌లు, యూనివర్సిటీల పరిసరాల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రముఖ మీడియా సంస్థలు, మీడియా ఏజెన్సీలు కూడా దీనిపై కథనాలు ప్రచురించాయి. అంతేకాకుండా సోషల్ మీడియలో ఈ అంశం విస్తృతంగా ప్రచారం జరిగింది. సంచలన నిర్ణయాలకు కేరాఫ్‌గా నిలిచే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిజంగానే విద్యాసంస్థలో మొబైల్స్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించారని అంతా భావించారు. అయితే తాజాగా అందులో ఏ మాత్రం నిజం లేదని.. తప్పుడు వార్త అని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment