ఖరీదైన ఫోన్లలో ఆ గేమ్ ఆడొద్దు..!
లండన్: ఖరీదైన మొబైల్ ఫోన్లలో పోకిమన్ గో గేమ్ ఆడుతున్న వారికి లండన్ పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. ఒళ్లు మరచిపోయి, చుట్టూ ఏం జరుగుతుందో కూడా చూడకుండా.. ఫోన్లలో తలదూర్చే వారిని దొపిడి దొంగలు ఇటీవల టార్గెట్గా చేస్తున్నారు. దీంతో పిల్లలు, పెద్దలను ఖరీదైన ఫోన్లలో పోకిమన్ గో ఆడుతూ వీధుల వెంట తిరగొద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
నార్త్ లండన్ పార్క్లో ఇటీవల పోకిమన్ గో ఆడుతున్న ముగ్గురు టీనేజ్ పిల్లల ఫోన్లను దుండగులు దోచుకున్నారు. పిల్లల కణతలకు గన్ పెట్టి బెదిరించిన దుండగులు ఖరీదైన ఫోన్లను తీసుకొని పారిపోయారు. ఈ ప్రమాదకర గేమ్ ఆడేవారు 'తమ చుట్టూ ఏం జరుగుతుంది' అనే విషయం కూడా మరచి.. ఫోన్లలో పోకిమన్లను వెతికే పనిలో ఉంటున్నారు. దీంతో దోపిడిదారుల పని సులువౌతోందని పోలీసులు తెలిపారు.