6 కోట్ల విలువైన షావోమి మొబైల్‌ ఫోన్లను.. | 6 Crore Rupees Worth Mobile Phones Stolen In Chittoor | Sakshi
Sakshi News home page

సినీ ఫక్కీలో కంటైనర్‌ లూటీ

Aug 26 2020 4:58 PM | Updated on Aug 26 2020 5:56 PM

6 Crore Rupees Worth Mobile Phones Stolen In Chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు : సినీ ఫక్కీలో మొబైల్‌ఫోన్ల లోడ్‌తో వెళుతున్న ఓ కంటైనర్‌ను అడ్డగించి అందులోని కోట్ల రూపాయలు విలువ చేసే ఫోన్లను ఎత్తుకుపోయారు దుండగులు. ఈ సంఘటన మంగళవారం రాత్రి చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిన్న రాత్రి మొబైల్‌ లోడ్‌ కంటైనర్‌ శ్రీ పెరంబూర్‌ నుండి ముంబైకి బయలు దేరింది. కంటైనర్‌ ఆంధ్రా బార్డర్‌ నగిరి వద్దకు రాగానే దానికి లారీని అడ్డం పెట్టారు దుండగులు. అనంతరం డ్రైవర్‌ను కొట్టి అందులోని 6 కోట్ల రూపాయల విలువైన మొబైల్‌ ఫోన్లను ఎత్తుకెళ్లారు. ( దాచి.. దోచుకుంటున్నారు...! )

ఆ తర్వాత లారీ పుత్తూరు చేరుకోగానే మొబైల్స్‌ను వేరే లారీలోకి మార్చుకుని దొంగతనానికి ఉపయోగించిన లారీనీ అక్కడే వదిలేశారు. దొంగతనం జరిగిన సమయంలో కంటైనర్‌లో దాదాపు 12 కోట్ల రూపాయల విలువ చేసే ఫోన్స్‌ ఉన్నట్లు సమాచారం. అందులో 16 బాక్స్‌లు ఉండగా 8 బాక్సుల్లోని 7500 మొబైల్ ఫోన్లను దుండగులు దోచుకెళ్లారు. కంటైనర్‌లోని మొబైల్ ఫోన్లు అన్నీ కూడా షావోమీ కంపెనీ చెందినవి. బాధితుడు నగరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తుపాకీ గురిపెట్టి తనను కొట్టి దుండగులు లూటీకి పాల్పడినట్టు బాధితుడు ఇక్బాల్‌ వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement