కేంద్ర మంత్రులు మంత్రివర్గ సమావేశాలకు ఇకనుంచి సెల్‌ఫోన్‌లు తీసుకురావడాన్ని ప్రభుత్వం నిషేధించింది.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు మంత్రివర్గ సమావేశాలకు ఇకనుంచి సెల్‌ఫోన్‌లు తీసుకురావడాన్ని ప్రభుత్వం నిషేధించింది. మంత్రుల ఫోన్లను దుండగులు హ్యాక్ చేసి, సమావేశాల్లో చర్చించే సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సమాచారాన్ని మంత్రులకు అందించి, వారు సమావేశాలకు సెల్‌ఫోన్లు తీసుకురాకుండా చూడాలని మంత్రివర్గ సచివాలయం..మంత్రుల ప్రైవేటు కార్యదర్శులను ఆదేశించింది.