
లండన్: ఇంట్లో పిల్లలను బుజ్జగించడానికి ఏదో సరదాగా ఇచ్చిన మొలైల్ ఫోన్ ఆ తర్వాత వారి పాలిట శాపంగా మారవచ్చు. బొమ్మలతో ఆడుకోవాల్సిన వాళ్లు మొబైల్ మాత్రమే కావాలని మారాం చేయవచ్చు. చిన్నగా మొదలైన ఈ వ్యసనం చిలికి చిలికి గాలి వానగా మారితే.. ఇదిగో ఈ బుడ్డోడి ముందు ఎన్ని బొమ్మలు వేసిన మొబైల్ కోసమే వెతికినట్లు తయారయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ చిన్న పిల్లవాడు ముందు ఆడుకునే బొమ్మలతో పాటు.. ఓ మొబైల్ ఫోన్‌ను ఉంచారు.
అయితే ఆ పిల్లవాడిని ఎన్నిసార్లు వదిలినా మొబైల్ ఫోన్ కోసమే వెదుకుతాడు. ఈ వీడియోను ఇంగ్లండ్‌లోని నార్‌ఫోక్‌లో గోర్లేస్టన్-ఆన్-సీకి చెందిన లెన్నీ అనే వారి ఇంట్లో చిత్రీకరించారు. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను తాత్కాలికంగా బుజ్జగించడానికి మొబైల్స్‌ని ఇస్తే.. దాని తర్వాతి పరిణామాలకు వారే బాధ్యులు.’’ అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ ‘‘తల్లిదండ్రులు పిల్లల ముందు మొబైల్ ఫోన్‌లు పట్టుకుని కూర్చోవడం కంటే.. వారితో సరదాగా గడిపి.. ఆడిస్తే బాగుంటుంది.’’ అంటూ రాసుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment