న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లతో కరోనా వైరస్ ముప్పు అధికంగా ఉంటుందని రాయపూర్‌కు చెందిన ఎయిమ్స్ వైద్యులు హెచ్చరించారు. కోవిడ్–19 సంక్షోభం నేపథ్యంలో ఆసుపత్రుల్లో మొబైల్స్ ఫోన్ల వాడకంపై నియంత్రణలు విధించాలని వారు సూచించారు. ఈ అంశంపై బీఎంజే గ్లోబల్ హెల్త్ జనరల్‌లో ఒక కథనం ప్రచురితమైంది. వైరస్‌ను వ్యాప్తి చేసే సాధనాల్లో మొబైల్ ఫోన్లు ముందుంటాయని, దీనివల్ల ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకే అవకాశం ఉంటుందని ఎయిమ్స్ వైద్య బృందం హెచ్చరించింది.
వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించడానికి ముఖం, నోరు, కళ్లు, చేతులు అత్యంత కీలకం. ముఖానికి అత్యంత దగ్గరగా వచ్చే వస్తువు మొబైల్ ఫోనే కావడంతో వైరస్ విస్తరణలో అత్యంత ప్రమాదకరమని తెలిపింది. డబ్ల్యూహెచ్‌వో వంటి సంస్థలు మొబైల్ ఫోన్ల వాడకంపై ఎలాంటి నియంత్రణా చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపింది. ఆస్పత్రుల్లో సిబ్బంది అంతా ఫోన్లను వినియోగిస్తున్నా, వారిలో 10 శాతం మంది కూడా వాటిని పరిశుభ్రంగా ఉంచడం లేదని వారి పరిశీలనలో తేలిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment