
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్ల వాడకం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువని రాయ్‌పూర్‌కు చెందిన ఏఐఐఎమ్‌ఎస్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఫోన్లు ముఖానికి, నోటి దగ్గరకి తరచుగా రావటం జరుగుతుందని, ఒకవేళ వాటికి వైరస్ అంటుకుని ఉన్నట్లయితే మనం చేతులను ఎంత శుభ్రం చేసుకున్నప్పటికి ఫలితం లేకుండా పోతుందని అంటున్నారు. బీఎమ్‌జే గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ముఖ్యంగా ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వారు ప్రతీ 15నుంచి 2 గంటల లోపు మొబైల్ ఫోన్లను వాడుతున్నారని, తద్వారా ఆరోగ్య సిబ్బందికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ, సీడీఎస్‌లు విడుదల చేసిన సేఫ్టీ గైడ్‌లైన్స్‌లో మొబైల్ ఫోన్ల వాడకంపై దృష్టి సారించలేదని తెలిపారు. మొబైల్ ఫోన్ల ద్వారా చేతుల శుభ్రత దెబ్బ తింటుందని, అవి హానికరమైన సూక్ష్మ జీవులకు నెలవులని వెల్లడించారు. ( కోవిడ్: మరో సరికొత్త ఆవిష్కరణ! )
ఆరోగ్య కేంద్రాలు, ఐసీయూలు, ఆపరేషన్ థియోటర్లలో ఫోన్లను ఉపయోగించటంపై నిబంధనలు విధించాలని అన్నారు. మొబైల్ ఫోన్లు, హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్‌లను ఒకరివి మరొకరు వాడటం మానేయాలని తెలిపారు. ఫోన్లు, కంప్యూటర్లు శుభ్రం చేసుకోవటానికి వీలుగా ఉండేలా చూసుకోవాలని, వీటి వాడకానికి ముందు తర్వాత చేతులను శానటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని సలహా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment