
సోషల్ మీడియాలో అత్యధిక, అత్యల్ప సమయం గడుపుతున్న కొన్ని దేశాల వివరాలివీ.. (గంటలు : నిమిషాలు)
తలెత్తుకు తిరగాలని అనేవారు.. పూర్వం.. ఇప్పుడు ఎవర్ని చూసినా.. తల దించుకుని.. ఫోన్‌లో బిజీబిజీగా మునిగిపోయేవారే కనిపిస్తున్నారు. సోషల్ మీడియా హవా మొదలయ్యాక.. ఇది మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్త లెక్క తీసుకుంటే.. 2021లో రోజులో సగటున 2.27 గంటల సమయం జనం సోషల్ మీడియాలోనే గడిపేశారని తేలింది.
2018, 19లతో పోలిస్తే.. 2020 తొలి నెలల్లో కొన్ని దేశాల్లో ఈ ట్రెండ్‌లో క్షీణత కనిపించినప్పటికీ.. కరోనా మహమ్మారి మొదలయ్యాక.. మళ్లీ పుంజుకుందని ‘గ్లోబల్ వెబ్ ఇండెక్స్’ సర్వే తెలిపింది. అంతేకాదు.. జనాభాలో యువత శాతం ఎక్కువగా ఉన్న దేశాల్లో ఈ వ్యసనం ఎక్కువగా ఉండగా.. మిగతా దేశాలతో పోలిస్తే.. వృద్ధుల శాతం ఎక్కువగా ఉన్న జపాన్, జర్మనీల్లో ఇది కొంచెం తక్కువగా ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment