మొబైల్ మెసేజింగ్‌తో డయాబెటిస్ చెక్!
న్యూయార్క్: టెక్నాలజీని మనం ఎలా వాడకుంటే అలా ఉపయోగపడుతుంది. ఒకవైపు స్మార్ట్ ఫోన్లతో విచిత్రమైన జబ్బులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నా, మరో వైపు మొబైల్ ఫోన్లను సరైన పద్ధతిలో వాడితో రోగాలకు కూడా చెక్ పెట్టవచ్చని ఓ అధ్యయనంలో తేలింది. మొబైల్ యూజర్లకి ఆహార , వ్యాయామ నిబంధనలను ఎప్పటికప్పుడు మెసేజ్‌ల రూపంలో పంపడం ద్వారా డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గాయని ఓ అధ్యయనంలో తేలింది.
కేవలం స్మార్ట్ ఫోన్లే కాకుండా, సాధారణ మొబైళ్ల ద్వారా కూడా ప్రజలను అప్రమత్తం చేయవచ్చని ఈ సర్వే ద్వారా తెలిసిందని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏంజెలా ఫిడ్లెర్ తెలిపారు. భారత్‌లోని సుమారు పది లక్షల మందిపై సర్వేలు జరిపిన తరువాత దాదాపు 40 శాతం మంది ఆరోగ్య పరిస్థితులు మొబైల్ సందేశాల ద్వారా మెరుగయ్యాయని వివరించారు. భారతదేశంలో 30-40 ఏళ్లలోపే డయాబెటిస్ బారిన పడుతున్నారని ఫిడ్లెర్ తెలిపారు.