
రాజస్థాన్ నుంచి అజారుద్దీన్ పోటీ
న్యూఢిల్లీ: 58 మంది లోక్సభ అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల చేసింది. పలువురు కేంద్ర మంత్రులకు సీట్లు ఖరారు చేశారు. కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలో జైలుకు వెళ్లొచ్చిన సురేష్ కల్మాడీకి మొండిచేయి చూపారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పూణె స్థానాన్ని విశ్వజీత్ కదంకు కేటాయించారు.
చాందినీచౌక్ నుంచి కపిల్ సిబల్, న్యూఢిల్లీ నుంచి అజయ్‌మాకెన్, వాయవ్య ఢిల్లీ నుంచి క్రిష్టతీర్థ్ పోటీ చేయనున్నారు. మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ ఈసారి రాజస్థాన్లోని టోంక్ సావా మధోపూర్ నుంచి బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్లోని మొర్దాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సీనియర్ నేత అజిత్‌జోగీకి ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ సీటు కేటాయించారు. మోడీపై వారణాసిలో పోటీ చేసే అభ్యర్థి పేరును త్వరలో ప్రకటిస్తామని కాంగ్రెస్ తెలిపింది.