
'సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజు'
న్యూఢిల్లీ: భారత దేశచరిత్రలో ఈ రోజును సువర్ణ అక్షరాలతో లిఖించాలని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్దరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది.
అరుణాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభానికి కారణమైన గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజఖోవా తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకున్న కేంద్ర మంత్రులు తమ పాత్రపై వివరణ ఇచ్చి, క్షమాపణ చెప్పాలన్నారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నబం తుకీ కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు.
అయితే సుప్రీంకోర్టు తీర్పు తమకు ఎదురుదెబ్బ కాదని, అది రాష్టానికి సంబంధించిన అంతర్గత వ్యవహారమని బీజేపీ పేర్కొంది.