గాంధీలు స్వచ్ఛందంగా తప్పుకుంటేనే కాంగ్రెస్‌కి మనుగడ! | Kapil Sibal Said Gandhis Should Make Way For New Leadership | Sakshi
Sakshi News home page

voluntarily move away: కొత్తవారికి అవకాశం ఇస్తేనే కాంగ్రెస్‌ మనుగడ

Published Tue, Mar 15 2022 2:55 PM | Last Updated on Tue, Mar 15 2022 3:19 PM

Kapil Sibal Said Gandhis Should Make Way For New Leadership - Sakshi

న్యూఢిల్లీ: గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్‌ ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. ఎన్నో ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఊహింని విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రలోనూ సరియైన మెజార్టీతో గెలవలేకపోయింది. దీంతో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ గత ఆదివారం ఐదు గంటల పాటు పెద్ద సమావేశాన్ని నిర్వహించింది.

కానీ ఈ సమావేశంలో పార్టీ సభ్యులు సోనియా గాంధీ నాయకత్వంపై తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించడంతో యథాతథ స్థితి నుంచి వైదొలగకూడదని నిర్ణయించుకున్నారు అని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు కపిల్‌ సిబల్‌ అన్నారు. గాంధీలు నాయకత్వ పదవుల నుంచి తప్పుకుని ఇతరులకు అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. గాంధీలు స్వచ్ఛందంగా వెళ్లిపోతేనే మంచిది ఎందుకంటే వారు నామినేట్ చేసిన పార్టీ సభ్యులు అధికార పగ్గాలను కొనసాగించకూడదని వారికి ఎప్పటికీ చెప్పలేరు అని చెప్పారు. రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ నాయకుడు కాకపోయినప్పటికీ వాస్తవ అధ్యక్షుడిలా నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు.

" అంతేకాదు రాహుల్ గాంధీ పంజాబ్ వెళ్లి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు. అతను ఏ హోదాలో ఈ పని చేశారు? ఆయన పార్టీ అధ్యక్షుడు కాదు, అన్ని నిర్ణయాలూ ఆయనే తీసుకుంటారు. ఆయన ఇప్పటికే వాస్తవ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటప్పుడు ఆయనను తిరిగి అధికార పగ్గాలు చేపట్టాలని అడగడం అర్థం లేని విషయంగా అభివర్ణించారు.

తాను ఘర్ కీ కాంగ్రెస్"కి విరుద్ధంగా "సబ్ కీ కాంగ్రెస్"ని కోరుకుంటున్నట్లు చెప్పారు. పైగా ఆయన తన చివరి శ్వాస వరకు ‘సబ్ కీ కాంగ్రెస్’ కోసం పోరాడతానని అన్నారు. అంతేకాదు కాంగ్రెస్‌లోని చాలామంది నేతు సీడబ్ల్యూసీకి విరుద్ధమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. సీడబ్ల్యూసీ వెలుపల కాంగ్రెస్ ఉందని దయచేసి మీరు వారి అభిప్రాయాలను వినండి అని విజ్ఞప్తి చేశారు. 2020లో 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు పార్టీలో పెద్ద మార్పులు చేయాలని సోనియా గాంధీకి రాసిన లేఖపై కపిల్ సిబల్ కూడా సంతకం చేశారు.

(చదవండి: నువ్వు సినిమాల్లోనే హీరోవి.. నేను పొలిటికల్‌ హీరోని)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement