సిబల్‌కు న్యాయ బిల్లు తెచ్చిన తంటా!
Published Sun, Sep 8 2013 4:39 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: కొలీజియం వ్యవస్థను రద్దు చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ ఇరకాటంలో పడ్డారు! లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టకుండానే రాజ్యసభలో పెట్టి ఆమోదింపజేయడంతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. బిల్లును స్థాయీసంఘానికి పంపాలని బీజేపీ డిమాండ్ చేసినా.. చివరికి రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఇంతవరకు బాగానే ఉందికానీ.. అసలు ఆ బిల్లు లోక్‌సభకే రాలేదు. శుక్రవారమే లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. దీనిపై శనివారం రాజ్యసభలో బీజేపీ సభ్యుడు రవిశంకర్ ప్రసాద్.. సిబల్‌ను నిలదీశారు. ‘అర్జెంట్ అని చెప్పి మంత్రి రాజ్యసభలో ఆ బిల్లును ఆమోదింపచేశారు బిల్లును స్థాయీసంఘానికి పంపాలని కోరినా వినలేదు. తీరా ఆ బిల్లును లోక్‌సభ చేపట్టనేలేదు. సభను తప్పుదోవ పట్టించారు. దీనిపై సిబల్ క్షమాపణ చెప్పాల్సిందే’ అని డిమాండ్ చేశారు. దీంతో సిబల్ సభకు క్షమాపణ చెప్పారు.
Advertisement
Advertisement