సామాన్యుడి సేవలో పోస్టల్
Published Sat, Mar 1 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM
న్యూఢిల్లీ: సామాన్యుల కోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలను చేపడుతోందని కేంద్రమంత్రి కపిల్ సిబాల్ తెలిపారు. నగరంలోని రెండు ప్రాంతాల్లో పోస్టల్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాదారుల కోసం ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ (ఏటీఎం) సేవలను పోస్టల్ శాఖ శనివారం ప్రారంభించింది. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (సీబీఎస్) ప్రాజెక్టులో భాగంగా 2015 మార్చి వరకు దేశవ్యాప్తంగా 2,800 ఏటీఎంలను ప్రారంభించనున్నారు. దేశంలో ఉన్న మొత్తం 1.6 లక్షల పోస్టాఫీస్‌ల ఆధునికీకరణలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కమ్యూనికేషన్స్ అండ్ ఐటీ మంత్రి క పిల్ సిబాల్ తెలిపారు. ఆయన ఐటీవో పోస్టాఫీస్ వద్ద ఏటీఎంను శనివారం ప్రారంభించారు. మరో ఏటీఎం కాశ్మీరీ గేట్ పోస్టాఫీస్ వద్ద ప్రారంభమైంది. ‘ఇది చాలా దూర ప్రయాణం. అయితే ప్రయాణం ప్రారంభించాం. 2015 మార్చివరకు దేశవ్యాప్తంగా 2,800 ఏటీఎంలను ఏర్పాటుచేయాలని నిర్ణయించాం..’ అని సిబాల్ వివరించా రు.
‘కొందరు సామాన్యుల గురించి మాట్లాడతారు అంతే.. మేం నిశ్శబ్దంగా సామాన్యుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం.. ఈ ఏటీఎంలు సామాన్యుల కోసమే.. వారికి నా అభినందనలు..’ అని సిబాల్ వ్యాఖ్యానించారు.‘ఈ ఏటీఎంలు మొ దటి 6-8 నెలల వరకు కేవలం పోస్టాఫీస్ వినియోగదారులకు మాత్రమే సేవలందిస్తా యి. తర్వాత వీటిని ఇతర బ్యాంకుల ఏటీఎంలకు అనుసంబంధానం చేస్తాం..దీనిద్వారా ఏ బ్యాంక్ వినియోగదారుడైన వీటినుంచి డబ్బులు తీసుకోవచ్చు..అలాగే పోస్టాఫీస్ వినియోగదారులు కూడా ఏ బ్యాంక్ ఏటీఎంనుంచైనా డబ్బులు తీసుకోగలిగే సౌలభ్యం ఏర్పడుతుంది..’ అని ఢిల్లీ సర్కిల్ ప్రధా న పోస్ట్ మాస్టర్ జనరల్ వసుమిత్రా తెలిపారు. ఈ నెలాఖరువరకు ఢిల్లీలో మరో 86 ఏటీఎంలను ఏర్పాటుచేయనున్నామన్నారు. 2015 మార్చి కల్లా 600 ఏటీఎంలు నగరవాసులకు అందుబాటులోకి వస్తాయని వివరిం చారు. ‘ఇండియా పోస్ట్ దేశంలోని ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం, ఆంధ్రప్రదేశ్ వంటి ఏడు రాష్ట్రాల్లో ఉన్న 64 లక్షల పొదుపుఖాతాలను ఈ సీబీఎస్‌తో అనుసంధానం చేసింది. దీనికి తోడు ఇండియా పోస్ట్ కూడా బ్యాం కింగ్ లెసైన్సు కోసం దరఖాస్తు చేసుకుంద’ని సిబాల్ వివరించారు.
Advertisement