కొత్త సీఐసీగా సుష్మాసింగ్ | Information Commissioner Sushma Singh to take over as CIC | Sakshi
Sakshi News home page

కొత్త సీఐసీగా సుష్మాసింగ్

Published Fri, Dec 6 2013 5:34 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM

కొత్త సీఐసీగా సుష్మాసింగ్

కొత్త సీఐసీగా సుష్మాసింగ్

న్యూఢిల్లీ: కొత్త ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా సీనియర్ సమాచార కమిషనర్, మాజీ ఐఏఎస్ అధికారి సుష్మాసింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఐసీ దీపక్ సంధు పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో తదుపరి సీఐసీగా సుష్మాసింగ్ ఎంపికయ్యారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, లోక్‌సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్‌లతో కూడిన ప్యానెల్ ఆమెను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.

 

సంధు తర్వాత సీఐసీగా బాధ్యతలు చేపట్టనున్న రెండో మహిళ సుష్మాసింగ్ కావడం గమనార్హం. ఐఏఎస్ అధికారిగా 2009 మే 31న ఉద్యోగ విరమణ చేసిన సింగ్.. కేంద్ర సమాచార  కమిషన్‌లో సమాచార కమిషర్‌గా 2009 సెప్టెంబర్ 23న నియమితులయ్యారు. జార్ఖండ్ కేడర్‌కు చెందిన ఆమె భారత ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement