'ఆవిడ' కంపెనీల మాటేంటి? | Subramanian Swamy accuses kapil sibal of not disclosing companies owned by wife | Sakshi
Sakshi News home page

'ఆవిడ' కంపెనీల మాటేంటి?

Published Sat, Apr 12 2014 7:24 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

Subramanian Swamy accuses kapil sibal of not disclosing companies owned by wife

న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ ఉద్దేశపూర్వకంగానే తన భార్య పేరిట ఉన్న కంపెనీల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో చెప్పలేదని బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ప్రతిష్ఠాత్మక చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సిబల్పై ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, సిబల్ ఈ ఆరోపణలను ఖండించారు.

తన భార్య పేరిట ఉన్న మూడు కంపెనీలకు చెందిన ఆస్తులు, అప్పుల వివరాలను సిబల్ కావాలనే దాచిపెట్టారని ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మకు ఇచ్చిన ఫిర్యాదులో స్వామి ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండించిన కపిల్ సిబల్, తాను బయటపెట్టకుండా ఉన్న ఆస్తులు ఏమైనా ఉంటే, వాటిని ఉచితంగా స్వామికి ఇచ్చేస్తానని ఆఫర్ కూడా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement