chandini chowk
-
చాందినీ చౌక్ చరిత్ర ఏమిటి? ఈ మార్కెట్ ఎలా ఏర్పాటయ్యింది?
ఎవరిమధ్యనైనా ఢిల్లీకి సంబంధించిన ప్రస్తావన వచ్చిప్పుడు చాందినీ చౌక్‌ను తప్పక తలచుకుంటారు. చాందినీ చౌక్ పలు సినిమాల్లో కూడా కనిపించింది. చాందినీ చౌక్ పేరుతో ఒక చిత్రం కూడా విడుదలయ్యింది. చాందినీ చౌక్ ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ అనేక రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి. సరసమైన ధరలకు దుస్తులు, ఆభరణాలు.. ఇలా ఒకటేమిటి ఏ వస్తువైనా ఇక్కడ చిటికెలో దొరుకుతుంది. షాపింగ్‌తో పాటు రుచికరమైన తినుబండారాలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి. చాందినీ చౌక్ ఎంతో పురాతనమైన మార్కెట్. దీనికి 370 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ మార్కెట్లోని ఇరుకైన వీధులను కత్రా అని పిలుస్తారు. మార్కెట్ నిత్యం కొనుగోలుదారులతో రద్దీగా ఉంటుంది. పాత ఢిల్లీలో ఉన్న ఈ చాందినీ చౌక్ మార్కెట్ ఢిల్లీకి గర్వకారణంగా నిలుస్తుంది. ఇక్కడ అన్ని వయసుల వారికి వారు కోరుకున్న వస్తువులు లభ్యమవుతాయి. షాజహాన్ తన కూతురి కోసం.. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని షాజహానాబాద్ అని పిలిచేవారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమార్తెకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె అభిరుచిని నెరవేర్చేందుకు చక్రవర్తి తన ఎర్రకోట ముందు మార్కెట్‌ను ఏర్పాటు చేశాడు. దీంతో షాజహాన్ కుమార్తె ఇక్కడ షాపింగ్ చేసేది. 1650లో షాజహాన్ ఈ మార్కెట్‌ను నిర్మించాడు. క్రమంగా ఈ మార్కెట్ చాలా ప్రసిద్ధి చెందింది. ఢిల్లీలోని ప్రత్యేక మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. మత సామరస్యానికి ఉదాహరణ చాందినీ చౌక్‌ను షాజహాన్ స్థాపించినప్పటికీ, ఇక్కడ అందరికీ షాపింగ్ చేసే అవకాశం ఉంది. చాందినీ చౌక్ ఏరియా అన్ని మతాలకు చెందిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రముఖ గౌరీ శంకర్ ఆలయం, ఫతేపురి మసీదు ఉన్నాయి. అంతే కాదు ప్రసిద్ధ సిక్కు గురుద్వారా శిష్‌గంజ్ కూడా చాందినీ చౌక్‌లో ఉంది. సెంట్రల్ బాప్టిస్ట్ చర్చి కూడా ఇక్కడ ఉంది. చాందినీ చౌక్ మార్కెట్ వెండి, బంగారు ఆభరణాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వివాహ షాపింగ్ చాలా చౌకగా చేయవచ్చని పలువురు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని వణికించిన 8 ఉగ్రదాడులు -
ఆ మతఘర్షణలపై అమిత్ షా సీరియస్..!
న్యూఢిల్లీ: హస్తినలోని హవజ్ ఖాజీ ప్రాంతంలో గత ఆదివారం సాయంత్రం మతఘర్షణలు జరగడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో పాతనగరంగా పేరొందిన చాందినీచౌక్ హవజ్ ఖాజీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం పార్కింగ్ విషయమై రెండు వర్గాల మధ్య గొడవ తలెత్తింది. ఇది చినికిచినికి గాలివానగా మారి.. మతఘర్షణలు, హింసకు దారితీసింది. ఈ ఘర్షణల్లో స్థానికంగా ఉన్న ఆలయం ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు కమిషనర్ అముల్యా పట్నాయక్‌ను పిలిపించుకొని మరీ.. ఈ ఘటనపై ఆరా తీశారు. హవజ్ ఖాజీ ఘటన గురించి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేదానిపై సాధారణ బ్రీఫింగ్లో భాగంగా హోంమంత్రికి సమాచారం తెలియజేశానని, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని.. హోంమంత్రి షాతో భేటీ అనంతరం పట్నాయక్ మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో ఒక మైనర్ సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని, నేరగాళ్లకు ఈ ఘటనలో ప్రమేయముందని భావిస్తున్నామని ఢిల్లీ సీపీ పట్నాయక్ తెలిపారు. గత ఆదివారం పండ్ల వ్యాపారి సంజీవ్ గుప్తా.. ఆస్ మహమ్మద్ అనే వ్యక్తుల మధ్య జరిగిన గొడవ.. ఈ మతఘర్షణలకు దారితీసింది. సంజీవ్ గుప్తా ఇంటిముందు ఆస్ మహమ్మద్ తన కారును పార్కు చేయడం.. దీనికి అభ్యంతరం వ్యక్తం చేయడంతో గుప్తాపై మహమ్మద్ తన మనుషులతో వచ్చి దాడి చేసినట్టు తెలుస్తోంది. దీనిపై గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని మహమ్మద్‌ను, మరికొంతమందిని అరెస్టు చేశారు. దీంతో ఆయన విడుదల చేయాలంటూ పోలీసు స్టేషన్ ఎదుట ఒక వర్గం వారు ధర్నాకు దిగడం.. ఈ ఘర్షణలకు దారితీసినట్టు భావిస్తున్నారు. -
డ్రైవర్‌కు గుండెపోటు.. పాదచారులపైకి బస్సు
అది దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే చాందినీ చౌక్ ప్రాంతం. సమయం సాయంత్రం 4 గంటలు. ఓ బస్సు ఉన్నట్టుండి అటూ ఇటూ తిరిగిపోతూ పాదచారులను ఢీకొంది. దాంతో గుర్తుతెలియని ఓ వ్యక్తి చనిపోయాడు కూడా. ఎందుకలా జరుగుతోందని బస్సులో ఉన్నవాళ్లు కూడా ఖంగారు పడ్డారు. తీరాచూస్తే.. బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. స్టీరింగ్ వీల్ మీద వాలిపోయాడు. ఈ ఘటనలో సంతోష్ కుమార్ (19), ఆయన అన్న మహేందర్ కుమార్ (24), మరో పాదచారి రాజేష్ కుర్మా (45) తీవ్రంగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ వాజిద్ అలీని ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడు. తమవద్దకు ఐదుగురు పేషంట్లను తీసుకొచ్చారని, వాళ్లలో ఇద్దరు తెచ్చేసరికే మరణించారని సుశ్రుత ట్రామ సెంటర్ సీఎంఓ డాక్టర్ ఎస్ఎం బస్నా తెలిపారు. -
'ఆవిడ' కంపెనీల మాటేంటి?
న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ ఉద్దేశపూర్వకంగానే తన భార్య పేరిట ఉన్న కంపెనీల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో చెప్పలేదని బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రతిష్ఠాత్మక చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సిబల్పై ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, సిబల్ ఈ ఆరోపణలను ఖండించారు. తన భార్య పేరిట ఉన్న మూడు కంపెనీలకు చెందిన ఆస్తులు, అప్పుల వివరాలను సిబల్ కావాలనే దాచిపెట్టారని ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మకు ఇచ్చిన ఫిర్యాదులో స్వామి ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండించిన కపిల్ సిబల్, తాను బయటపెట్టకుండా ఉన్న ఆస్తులు ఏమైనా ఉంటే, వాటిని ఉచితంగా స్వామికి ఇచ్చేస్తానని ఆఫర్ కూడా ఇచ్చారు.