ప్రియాంకపై వ్యాఖ్యలకు నిరసగా సుబ్రహ్మణ్యస్వామి ఇంటి ముట్టడి | congress supporters agitated at Subramanian Swamy house | Sakshi
Sakshi News home page

ప్రియాంకపై వ్యాఖ్యలకు నిరసగా సుబ్రహ్మణ్యస్వామి ఇంటి ముట్టడి

Published Tue, Apr 15 2014 4:58 PM | Last Updated on Sat, Sep 2 2017 6:04 AM

ప్రియాంకపై వ్యాఖ్యలకు నిరసగా సుబ్రహ్మణ్యస్వామి ఇంటి ముట్టడి

ప్రియాంకపై వ్యాఖ్యలకు నిరసగా సుబ్రహ్మణ్యస్వామి ఇంటి ముట్టడి

ఢిల్లీ: ప్రియాంక గాంధీపై బీజేపీ చేసిన విమర్శలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. సుబ్రహ్మణ్య స్వామి ఇంటిముందు  ఆందోళన చేపట్టి ఆయన ఇంటి గేటును ధ్వంసం చేశారు. రాబర్ట వాద్రాను పెళ్లాడిన ప్రియాంకా గాంధీ ఆ దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ గర్వించదగ్గ కుమార్తె కాదని ఆయన తెలిపారు. తండ్రిని హత్య చేసిన ఖైదీలను కలవడానికి జైలుకు వెళ్లి.. వారికి క్షమాభిక్ష పెట్టమని ప్రభుత్వాన్నికోరడాన్ని సుబ్రహ్మణ్యస్వామి తప్పుబట్టారు

 

ఇదిలా ఉండగా, ఆమెకు విపరీతంగా మద్యం సేవించే అలవాటు ఉందని తీవ్ర వ్యాఖ్యలు  చేశారు. ప్రజల్లో ఇంత చెడ్డ పేరు సంపాదించుకున్నఆమె బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై పోటీకి దిగుతాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement