
కపిల్ సిబాల్
హైదరాబాద్: డిసెంబర్ 11న కేసీఆర్ ఓటమి ఖాయమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన కపిల్ సిబల్ మాట్లాడుతూ.. కేసీఆర్ దళిత సీఎం మాట మరిచారని, కేబినేట్లో మహిళలకు స్థానమే కల్పించలేదని అన్నారు. తెలంగాణలో కనీసం మహిళా కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. కాళేశ్వరం, క్యాంప్ ఆఫీసులు ఇలా అన్నీ రీడిజైన్‌లే చేసి ప్రభుత్వ ధనాన్ని దుబారా చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు అవకాశం ఇస్తే ఆయన ప్రజల్ని మోసం చేశారని అన్నారు.
విద్య గురించి ఆలోచన చేయని మనిషి రాష్ట్రం గురించి ఏం ఆలోచన చేస్తారని ప్రశ్నించారు. విద్య విషయంలో తెలంగాణ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని వ్యాఖ్యానించారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని తెలిపారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 4 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేశారని చెప్పారు. కేసీఆర్ నయా నిజాం అని, బ్రిటీష్ రూల్ మళ్లీ వచ్చిందా అన్నట్లుగా ఆయన పాలన సాగుతోందని అన్నారు. చంద్రశేఖర్ రావు కో హఠావో..తెలంగాణ కో బచావో అని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment