అజాంఘర్ నుంచి ఎందుకు పోటీ చేయకూడదు? | Narendra Modi why not stand from Azamgarh? Kapil Sibal asks | Sakshi
Sakshi News home page

అజాంఘర్ నుంచి ఎందుకు పోటీ చేయకూడదు?

Published Fri, Mar 14 2014 3:05 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

అజాంఘర్ నుంచి ఎందుకు పోటీ చేయకూడదు? - Sakshi

అజాంఘర్ నుంచి ఎందుకు పోటీ చేయకూడదు?

న్యూఢిల్లీ: సురక్షితమైన లోక్సభ స్థానం ఎందుకు చూసుకుంటున్నారని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ప్రశ్నాస్త్రం సంధించారు. దేశమంతా మోడీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని చెబుతున్నారని, అలాంటప్పుడు సులభంగా గెలిచే స్థానం కోసం ఎందుకు వెదుకులాడుతున్నారని ప్రశ్నించారు.

"నిజంగా మోడీ సానుకూల పవనాలు బలంగా వీస్తుంటే సురక్షితమైన స్థానం కోసం ఆయన వెతకాల్సిన పనివుందా? తనకు ముస్లింల మద్దతు ఉందని చెబుతున్న మోడీ... అజాంఘర్ నుంచి ఎందుకు పోటీ చేయకూడదు?" అని సిబల్ ట్వీట్ చేశారు. గుజరాత్లోని ఒక స్థానం నుంచి మోడీ పోటీ చేస్తారని బీజేపీ నాయకులు అంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి కూడా ఆయన పోటీ అవకాశం లేకపోలేదంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement