Azamgarh Lok sabha seat
-
‘CAA మోదీ గ్యారెంటీ.. ఎవరూ చెరపలేరు’
లక్నో: మోదీ వెళ్లిపోతే.. సీఏఏ కూడా వెళ్తుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, సీఏఏ మోదీ గ్యారెంటీ అనిర, దానిని ఎవరూ తొలగించలేరని బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం ఉత్తర ప్రదేశ్ అజాంఘడ్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మోదీ గ్యారెంటీలపై ప్రజలకు నమ్మకం ఉంది. సీఏఏ(CAA) చట్టమే మోదీ గ్యారెంటీకి తాజా ఉదాహరణ. సీఏఏ కింద భారత పౌర సత్వం ఇవ్వడం మొదలైంది. దేశంలో వీరంతా చాలా ఏళ్లుగా శరణార్థులుగా ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోనూ లక్షలమంది శరణార్థులు ఉన్నారు. వాళ్లందరికీ కూడా పౌరసత్వం లభిస్తుంది. మోదీ వెళ్తే సీఏఏ కూడా వెళ్లిపోతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, మోదీ గ్యారెంటీని ఎవరూ చెరపలేరు. విపక్ష కూటమి ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తోంది. కానీ, ప్రజలంతా బీజేపీ, ఎన్డీయే కూటమితోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఒక్కటే మాట వినిపిస్తోంది. అదే ఫిర్ ఏక్ బార్.. 400 పార్. మోదీ గ్యారెంటీ కశ్మీర్‌లోనూ కనిపిస్తోంది. కశ్మీర్లో శాంతికి గ్యారెంటీ ఇచ్చాం. కశ్మీర్లో తీసుకున్న చర్యలతో విపక్షాల నోళ్లు మూతలు పడ్డాయి. మోదీ వెళ్తే ఆర్టికల్ 370 రద్దు కూడా పోతుందని ప్రచారం చేస్తున్నారు. కానీ, నాల్గొ దశలో జరిగిన పోలింగ్‌లో శ్రీనగర్ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు అని ప్రధాని మోదీ అన్నారు.దేశంలో ఎక్కడ పేలుళ్లు జరిగినా ఆజాంఘడ్ గురింంచి చర్చ వచ్చేది. స్లీపర్‌సెల్స్ గురించి చర్చ జరిగేది. సమాజ్‌వాదీ పార్టీ ఎప్పుడూ ఆజాంఘడ్ గురించి ఆలోచించలేదు. ఆజాంఘడ్‌లో కమలం వికసిస్తేనే.. అభివృద్ధి జరుగుతుంది అని ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇండియా కూటమి రిజర్వేషన్లతో రాజకీయం చేస్తోంది. 50 శాతం బడ్జెట్‌ను మైనారిటీలకు కేటాయించాలనుకుంటోంది. 70 ఏళ్లుగా హిందూ, ముస్లిం అంటూ మతాల పేరిట వాళ్లు విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు దేశమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. రామమందిర ప్రారంభం నాడు ఇండియా కూటమి ఎన్నో విమర్శలు చేసింది. పేదల అభివృద్ధి కోసం పగలు రాత్రి కష్టపడుతున్నా. మీ బాధలన్నింటిని తొలగిస్తున్నాం. వివిధ పథకాలతో పేదలను ఆదుకుంటున్నాం అని మోదీ తెలిపారు. -
ఎస్పీ మొనగాడితో పాటగాడు పోటీ
సాక్షి, సెంట్రల్‌డెస్క్ : ఒకరు రాజకీయ నాయకుడు.. మరొకరు జానపద గాయకుడు.. ఇద్దరూ తమ రంగాల్లో లబ్ధప్రతిష్టులే.. భిన్న రంగాలకు చెందిన వీరిద్దరూ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో తలపడుతున్నారు. ఆ రాజకీయ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అయితే, మరొకరు జానపద గాయకుడు దినేశ్‌లాల్ యాదవ్. తూర్పు యూపీలోని అజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా అఖిలేశ్ యాదవ్ పోటీ చేస్తోంటే, ఆయనకు ప్రత్యర్థిగా బీజేపీ తరఫున దినేశ్‌లాల్ బరిలో దిగారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్ అయిన దినేశ్‌లాల్ ‘నిరహువ’గా సుప్రసిద్ధుడు. ఘాజీపూర్‌లోని తాండ్వా గ్రామవాసి అయిన దినేశ్‌లాల్ ‘నిరహువ సతల్ రహే’ ఆల్బమ్‌తో అశేష భోజ్పురీల మనసు దోచుకున్నాడు. గాయకుడిగానే కాకుండా నటుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. ఇంతకు ముందు సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న దినేశ్ గత ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. అయితే, కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సమక్షంలో బీజేపీలో చేరారు. వెంటనే ఆయనకు అజంగఢ్ టికెట్ ఇచ్చేసింది బీజేపీ. నియోజకవర్గంలో ఓ వర్గం ఓటర్లను దినేశ్‌లాల్ ఆకట్టుకోగలరన్న నమ్మకంతోనే ఆయనకు టికెట్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
అజాంఘర్ నుంచి ఎందుకు పోటీ చేయకూడదు?
న్యూఢిల్లీ: సురక్షితమైన లోక్‌సభ స్థానం ఎందుకు చూసుకుంటున్నారని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ప్రశ్నాస్త్రం సంధించారు. దేశమంతా మోడీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని చెబుతున్నారని, అలాంటప్పుడు సులభంగా గెలిచే స్థానం కోసం ఎందుకు వెదుకులాడుతున్నారని ప్రశ్నించారు. "నిజంగా మోడీ సానుకూల పవనాలు బలంగా వీస్తుంటే సురక్షితమైన స్థానం కోసం ఆయన వెతకాల్సిన పనివుందా? తనకు ముస్లింల మద్దతు ఉందని చెబుతున్న మోడీ... అజాంఘర్ నుంచి ఎందుకు పోటీ చేయకూడదు?" అని సిబల్ ట్వీట్ చేశారు. గుజరాత్‌లోని ఒక స్థానం నుంచి మోడీ పోటీ చేస్తారని బీజేపీ నాయకులు అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి కూడా ఆయన పోటీ అవకాశం లేకపోలేదంటున్నారు.