
గాంధీ హత్యను ఆరెస్సెస్‌కు ఆపాదించలేదు
సుప్రీం కోర్టులో రాహుల్ వివరణ
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీని ఆరెస్సెస్ సంస్థ హత్య చేసిందని తాను నిందించలేదని, ఈ ఘాతుకం వెనుక ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తులున్నారని మాత్రమే వ్యాఖ్యానిం చానని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. గాంధీ హత్యలో ఆరెస్సెస్ పాత్రపై రాహుల్ వ్యాఖ్యలపై వేసిన పరువు నష్టం కేసులో బుధవారం సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. రాహుల్ తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు.
దీనిపై విచారించిన ధర్మాసనం స్పందిస్తూ.. నిందితుడు గాంధీని ఆరెస్సెస్ హత్య చేసినట్లు వ్యాఖ్యానించలేదని, ఆ సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులు చేసినట్లు అన్నారని భావిస్తున్నట్లు పేర్కొంది. పిటిషనర్ సంతృప్తి చెందితే కేసును కొట్టివేస్తామంది.